News December 1, 2025
ఆత్మకూరులో సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సోమవారం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన రూ.15 కోట్ల చొప్పున ఆత్మకూరు, అమరచింత నగర అభివృద్ధి పనులకు, రూ.22 కోట్లతో 50 పడకల ఆసుపత్రి భవనానికి, రూ.121.92 కోట్లతో జూరాల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
Similar News
News March 7, 2026
HYD ఆక్రమణలు, చెత్తతో నిండింది: సీఎం

HYD ఆక్రమణలు, చెత్తతో నిండిపోయిందని గొప్ప సుందరమైన నగరంగా HYDను మంచిగా చేస్తానంటే BRS ఒప్పుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేము చేయలేదు నువ్వు చేయొద్దని KTR అంటున్నారని వ్యఖ్యానించారు. నగరాన్ని మంచిగా చేసుకోవడానికి ప్రజా ప్రతినిధులను విదేశాలకు పంపామన్నారు. విమానాశ్రయం కట్టే సమయంలో కొంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు అది పెద్ద ఆస్తిగా మారింది. ఎవ్వరూ మూసీలో బతకాలి అనుకోరన్నారు.
News March 7, 2026
CEC వేలు కోసేసే వాడిని.. TMC ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం మమతా బెనర్జీతో CEC చెడుగా ప్రవర్తించారు. CM వైపు వేలు ఎత్తడానికి ధైర్యం చేశారు. CEC కాకపోయుంటే నేను అదే రోజు ఆయన వేలును కోసేసే వాడిని’ అని కోల్‌కతాలో నిరసన కార్యక్రమంలో అన్నారు. SIR విషయంలో గత నెలలో జ్ఞానేశ్ కుమార్, మమత మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
News March 7, 2026
కామారెడ్డి: జర జాగ్రత్త..!

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో భిక్కనూరు, మేనూరు, సోమూరు 38.2°C, కొల్లూరు, సదాశివనగర్ 38.1, ఎల్పుగొండ, బీర్కూర్ 38, సర్వాపూర్ 37.8, డోంగ్లి, బీబీపేట 37.7, పుల్కల్, పిట్లం 37.3, మాచాపూర్, గాంధారి, నాగిరెడ్డిపేట 37.2, దోమకొండ 37.1, కామారెడ్డి 37, బిచ్కుంద 36.7, లింగంపేట, లచ్చపేట 36.6, జుక్కల్ 36.5°C ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


