News December 1, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. రూ.700కు చేరిన టమాటా

దిత్వా తుఫాను ఎఫెక్ట్ టమాటా ధరలపై పడింది. పుంగనూరు మార్కెట్‌లో సోమవారం 15 కిలోల టమాటా బాక్స్ రూ.700 పలికింది. 66.19 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. రెండో రకం రూ.500, మూడో రకం రూ.350 చొప్పున వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధరలు పెరిగినట్లు రైతులు తెలిపారు.
Similar News
News March 16, 2026
సెలవులో చిత్తూరు కలెక్టర్

వ్యక్తిగత కారణాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సెలవు పెట్టారు. నేటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు సెలవులో వెళ్తున్నారు. తిరిగి ఆయన 21న విధులకు హాజరుకానున్నారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.
News March 16, 2026
చిత్తూరు: నేటి నుంచి ‘రైతన్న-మీకోసం’ వారోత్సవాలు

జిల్లాలో సోమవారం నుంచి ‘రైతన్నా- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ మురళి తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రొసెసింగ్, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, సంక్షేమం నుంచి సంపద సృష్టి దిశగా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
News March 15, 2026
కాణిపాకం: 17న అత్యవసర ధర్మకర్తల మండలి సమావేశం

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 17న ఉదయం 10:30 గంటలకు అత్యవసర ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి పెంచల కిశోర్ తెలిపారు. యుద్ధ పరిస్థితులు, అవసరమైన సరుకుల సరఫరా, ప్రసాదానికి ఉపయోగించే గ్యాస్ సరఫరా సంబంధిత ఏర్పాట్లపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశానికి ధర్మకర్తల మండలి ఛైర్మెన్, సభ్యులు, అధికారులు హాజరుకావాలని వారు కోరారు.


