News April 18, 2024

భద్రాచలం: ఎడారిని తలపిస్తున్న గోదావరి

image

భద్రాద్రిలో గోదావరి ఎడారిని తలపిస్తోంది. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా చుక్క నీరు కూడా కనిపించడం లేదు. నిన్న జరిగిన శ్రీరామ నవమి వేడుకలలో ఉమ్మడి తెలుగు రాష్ట్రల నుంచి వేలాది మంది భక్తులు వచ్చారు. వారి కోసం మోటార్లు ద్వారా తాత్కలికంగా ఏర్పాటు చేసిన వాటి కింద భక్తులు స్థానాలు చేశారు.

Similar News

News December 30, 2025

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: ఖమ్మం CP

image

సంక్రాంతి పండుగ వేళ పక్షులు, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న నిషేధిత చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. పక్షుల విహారానికి, ప్రజల భద్రతకు భంగం కలిగించే ఈ మాంజా విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఎవరైనా చైనా మాంజాను విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

News December 30, 2025

న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

image

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 31 రాత్రి జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లపై వేడుకలు నిర్వహించడం నిషిద్ధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ఏర్పాటు చేశామన్నారు.

News December 30, 2025

GOOD NEWS చెప్పిన ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి వచ్చేవరకు పాత పద్ధతిలోనే ఎరువుల సరఫరా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలను పరిశీలించి, వారు సాగు చేస్తున్న పంట విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా కేటాయించాలని అధికారులను ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఎరువుల నిల్వలపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు.