News December 1, 2025

కామారెడ్డి: సర్పంచి అభ్యర్థిత్వం కోసం.. ఆత్మగౌరవాన్ని తాకట్టు!

image

కామారెడ్డి జిల్లాలో సర్పంచి ఎన్నికల సందడి జోరందుకుంది. టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కేవలం పదవిని గెలుచుకోవాలనే ఆశతో, బడా నాయకుల దృష్టిలో పడటానికి అభ్యర్థులు వింత పద్ధతులను అనుసరిస్తున్నారు. తమ అభ్యర్థిత్వం ఖరారు కావడానికి, వ్యక్తిగత ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి, కుటుంబ సభ్యులతో సహా బడా నేతల వద్దకు వెళ్లి శిరస్సుల తాకట్టు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News April 1, 2026

పెరిగిన ఇండిగో విమాన టికెట్ల ధరలు

image

విమాన ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని ప్రయాణికులపై మోపేందుకు ఇండిగో సిద్ధమైంది. ఏప్రిల్ 2 నుంచి టికెట్ బుకింగ్స్‌పై ఇంధన ఛార్జీలను సవరించనున్నట్లు ప్రకటించింది. దూరాన్ని బట్టి డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో ₹275-₹950, ఇంటర్నేషనల్ సర్వీసులలో ₹900-₹10,000 వరకు ఫ్యూయల్ ఛార్జెస్ పెరుగుతాయని తెలిపింది. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌కు 25%, ఇంటర్నేషనల్ సర్వీసెస్‌పై 100% ఇంధన ధరలు పెరిగిన విషయం తెలిసిందే.

News April 1, 2026

ఆసిఫాబాద్: విషాదం.. పదోన్నతి పొందిన రోజే మృతి

image

విధి నిర్వహణలో నిమగ్నమై ఉన్న కాగజ్‌నగర్‌కు చెందిన అస్సాం రాష్ట్రం సశస్త్ర సీమా బల్(SSB) SI దినేష్ కుమార్ మండల్(43) బుధవారం అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. 2004లో విధుల్లో చేరిన ఆయన, బుధవారమే సీఐగా పదోన్నతి పొందారు. ఉన్నత బాధ్యతలు చేపట్టాల్సిన రోజే మృత్యువు కబళించడంతో కాగజ్‌నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. పదోన్నతి పొందిన రోజే ఆయనను కోల్పోవడం శోచనీయమని తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.