News December 1, 2025
ఎలక్షన్ ఫీవర్.. మెదక్ ఎస్పీ హెచ్చరిక

మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరగాలంటే ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. గొడవలు, ప్రేరేపించే వ్యాఖ్యలు, ఓటర్లపై ఒత్తిడి, డబ్బు, మద్యం పంపిణీపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలకు ఆయుధాలు, మొబైల్‌లు నిషేధం. పుకార్లు పుట్టిస్తే చర్యలు తప్పవని తెలిపారు. అనుమానాస్పద ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News March 25, 2026
మెదక్ కలెక్టరేట్ వద్ద రిటైర్డ్ ఉద్యోగుల నిరసన

ధ్రువీకరణ చట్టం-2025ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ముందు రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య పిలుపు మేరకు ఈ నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ ద్వారా ప్రధాని మోడీకి వినతిపత్రం పంపారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు జగదీశ్ చంద్ర, సత్యనారాయణ, మోహన్ రాజ్ తదితరులు పాల్గొని, పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
News March 25, 2026
నర్సాపూర్: స్వయంభూగా కొలువైన సీతారామసమేత ఆలయం

స్వయంభు ఏకాంతంగా వెలిసిన సీతారామ స్వామి ఆలయంగా పేరు పొందుతున్న నర్సాపూర్ పట్టణ సమీపంలోని సీతారాంపూర్లో ప్రతిఏటా శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పూజారి హరిప్రసాద్ శర్మ తెలిపారు. 600 ఏళ్ల క్రితం కాకతీయులు ఆలయం నిర్మించినట్లు తెలిపారు. శ్రీ సీతారామసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజులపాటు ఉత్సవాల గురించి ఆయన వే2న్యూస్‌తో తెలిపారు. ఉదయగిరి చుట్టూ బండ్ల ప్రదక్షిణలు నిర్వహిస్తారన్నారు.
News March 24, 2026
మెదక్: ‘జనగణన పక్కాగా నిర్వహించాలి’

జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన విధులను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మండల ప్రణాళిక అధికారులు, సాంకేతిక సహాయకులకు జనగణన ప్రక్రియ, మొబైల్ యాప్ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. వివరాల సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, ఏప్రిల్‌లో సన్నాహక పనులు చేపడతామన్నారు.


