News December 1, 2025
HYD: కరెంటు బిల్లే క్రెడిట్ స్కోరు.!

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో ప్రభుత్వం కీలక ఆర్థిక సంస్కరణను ప్రకటించనుంది. ‘రుణ చరిత్ర లేని’ ప్రజల కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB) ఏర్పాటు కానుంది. ఈ సంస్థ కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు వంటి చెల్లింపుల రికార్డులను పరిశీలించి ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ను ఇస్తుంది. ఈ స్కోరు ఆధారంగా బ్యాంకులు లక్షలాది మందికి రుణాలు అందించే అవకాశం ఉందని అధికారులు Way2Newsకు తెలిపారు.
Similar News
News December 3, 2025
ASF: ఆదివాసీ పోరు గర్జన సభ వాయిదా

ఆసిఫాబాద్‌లో డిసెంబర్ 9న జరగాల్సిన ఆదివాసీ పోరు గర్జన సభను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తుడుం దెబ్బ నాయకత్వం తెలిపింది. పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ మారుతీ వాయిదా తీర్మానాన్ని ఎస్పీ నితిక పంత్‌కు లిఖితపూర్వకంగా అందజేశారు. సభ జరిగే కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని నాయకులు తెలిపారు.
News December 3, 2025
ఏలూరు: 16 మంది విద్యార్థులు సస్పెండ్

ఏలూరు వైద్య కళాశాలలో 3 సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపల్ సావిత్రి మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి జరిగిన జూనియర్, సీనియర్స్ మధ్య ఘర్షణపై బాధితుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు తీసుకొని విచారణ జరిపి 16 మంది విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ర్యాగింగ్ కమిటీ పర్యవేక్షణ నిర్వహిస్తున్నారని, ర్యాగింగ్‌కు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 3, 2025
నెల్లూరులో భారీ వర్షం.. నీట మునిగిన కారు

రాత్రి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురు గాలులకు 28వ డివిజన్లోని జీకే కాలనీలో భారీ చెట్టు పడిపోయింది. సమీపంలోని అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి నీళ్లు రావడంతో కార్లు, బైకులు పూర్తిగా మునిగిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ అధికారులతో కలిసి వాటర్‌ను బయటికి తీయిస్తున్నారు.


