News December 1, 2025
ప్రొద్దుటూరు: చిన్నోడే పెద్ద పోరాటం!

ప్రొద్దుటూరుకు చెందిన 6వ తరగతి విద్యార్థి ఎబినేజర్ ధైర్యసాహసాలు మెచ్చుకోవాల్సిందే. కాలువకు రక్షణ గోడలేక తన స్నేహితుడు కిందపడ్డాడని బాలుడు జీర్ణించుకోలేకపోయాడు. ఇలా మరొకరు ఇబ్బంది చెందకూడదని పోరాటానికి దిగాడు. కాలువకు వెంటనే రక్షణ గోడ నిర్మించాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డికి విన్నవించాడు. త్వరగా రక్షణగోడ నిర్మించకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని ఆ కుర్రాడు హెచ్చరించాడు.
Similar News
News March 28, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు వెండి ధరలు వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,000
* 22 క్యారెట్ 1 గ్రాము బంగారం ధర రూ.13,800
* 10 గ్రాముల వెండి ధర రూ.2,335.
News March 28, 2026
జగన్‌కు మాజీ సీఎం అని చెప్పుకొనే అర్హత లేదు: కడప ఎమ్మెల్యే

ఏపీ రాజధానిగా అమరావతి ఉండటానికి 2014-19లో మాజీ CM జగన్ మద్దతు తెలిపారని MLA మాధవిరెడ్డి పేర్కొన్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ఇవాళ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన తీర్మాన సభలో ఆమె మాట్లాడారు. 2019లో ఏపీ ప్రజలు జగన్‌కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. దీంతో ప్రజలు వారికి 11 స్థానాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. జగన్‌కు మాజీ సీఎం అని చెప్పుకొనే అర్హత కూడా లేదన్నారు.
News March 27, 2026
కడప: ఆశ వర్కర్ల నియామకంలో గోల్మాల్?

కడప జిల్లాలో ఇటీవల జరిగిన ఆశా వర్కర్ల నియామకంలో పూర్తిస్థాయిలో అవినీతి జరిగిందంటూ పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన మహిళలకు కాకుండా అనర్హత కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ ఆధారాలతో ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎటువంటి వెరిఫికేషన్ చేయకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారిని మాత్రమే నియమించారని ఆరోపణలు ఉన్నాయి.


