News December 1, 2025
ఆ వ్యాధి గురించి భయపడకండి: చిత్తూరు DMHO

చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు స్కబ్ టైపన్ కేసులు 149 నమోదయ్యాయని.. అందరూ కోలుకున్నారని DMHO సుధారాణి వెల్లడించారు. చిన్న నల్లి లాంటి ప్రాణి కుట్టడంతో ఈ వ్యాధి వస్తుందన్నారు. తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు ఉంటాయని తెలిపారు. బురదలో నడిచినప్పుడు, పొలాల్లో చెప్పులు లేకుండా తిరిగినప్పుడు ఇవి కుడుతాయన్నారు. జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే యాంటి బయోటిక్స్ ద్వారా నయమవుతుందని స్పష్టం చేశారు.
Similar News
News March 18, 2026
చిత్తూరు ZP విభజనకు కసరత్తు.!

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్‌ను ఎన్నికల నాటికి మూడు జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసేలా రాష్ట్రస్థాయిలో కసరత్తు నిర్వహిస్తున్నారు. సెప్టెంబరులో జడ్పీ పదవీకాలం ముగియనుండటంతో, ఆలోపు విభజించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు కొత్తగా జిల్లా పరిషత్తులు ఏర్పడనున్నాయి. దీంతో పరిపాలనా సౌలభ్యం మెరుగు పడనుంది.
News March 18, 2026
లక్ష్యం రూ.56 కోట్లు.. ఇంకా రూ.26 కోట్ల బకాయిలు

పట్టణాల్లో ఆస్తి, నీటి పన్ను లక్ష్యాలను చేరుకునేందుకు కేవలం 14 రోజులు మాత్రమే గడువు ఉంది. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, కుప్పం మున్సిపాలిటీల పరిధిలో సుమారు రూ.56 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ. 30 కోట్లు మాత్రమే వసూలు అయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం బకాయిలపై 50% వడ్డీ రాయితీ ప్రకటించిన నేపథ్యంలో 100% లక్ష్యాలు చేరుకుంటారేమో చూడాల్సి ఉంది.
News March 18, 2026
నేటి నుంచి చిత్తూరు జిల్లాలో ప్రత్యేక అధికారుల పాలన

మున్సిపాలిటీ పాలకవర్గానికి గడువు ముగియడంతో బుధవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి మున్సిపాలిటీలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. పరిపాలనాపరమైన నిర్ణయాలను ఇక వారే తీసుకోనున్నారు. కుప్పం మున్సిపాలిటీలో మాత్రం ఆలస్యంగా ఎన్నికలు జరగడంతో సెప్టెంబర్ వరకు పాలకవర్గానికి గడువు ఉంది.


