News December 1, 2025
గూడూరులో దారుణం

భార్య, అత్త కలిసి భర్తపై వేడివేడి నూనె పోసిన ఘటన గూడూరు ఇందిరానగర్‌లో జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ భర్త వారం నుంచి గొడవలు పడుతున్నాడు. ఈక్రమంలో భర్త తన బిడ్డలను చూడటానికి గూడూరులోని ఇందిరానగర్‌కు వెళ్లాడు. వేడి నూనె తనపై పోసి చంపడానికి ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 1, 2025
నెల్లూరు జిల్లాలో రేపు యథావిధిగా స్కూల్స్.!

నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో మంగళవారం యథావిధిగా స్కూల్స్ కొనసాగనున్నాయి. ‘దిత్వా’ తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురవడంతో సోమవారం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ 2న మోస్తరు వర్షాలు కురవనుండడంతో యథావిధిగా విద్యా సంస్థలు కొనసాగించాలని DEO ఆదేశాలు జారీ చేశారు.
News December 1, 2025
చిన్నబజార్ PSను తనిఖీ చేసిన గుంటూరు IG

నెల్లూరులోని చిన్నబజార్ PSను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలోని పరిస్థితులు, స్థితిగతులు, నేర ప్రాంతాలపై సిబ్బందిని అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులపట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. వీరి వెంట ఎస్పీ అజిత వేజెండ్ల ఉన్నారు.
News December 1, 2025
నెల్లూరు: మెడికల్ కాలేజీలో ఏం జరుగుతోంది..?

నెల్లూరు AC సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీలో వరుస సూసైడ్ కేసులు కలవరపెడుతున్నాయి. సరిగ్గా 2 నెలలకింద మెడికో విద్యార్థిని మృతి చెందగా.. తాజాగా మరో మెడికో మృతి చెందింది. అయితే హాస్టల్స్ విద్యార్థులపై పర్యవేక్షణ కొరవడిందా?. విద్యార్థులు హాస్టల్స్‌లో ఉన్నప్పుడే సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి?. వీటన్నింటిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, భద్రతా ప్రమాణాలు పాటించాలని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు.


