News December 1, 2025
సజ్జ రైతులకు దక్కని మద్దతు ధర

AP: సజ్జలను పండించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. అక్టోబరులో మొంథా తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు పంట నాణ్యత, దిగుబడి తగ్గింది. చేతికొచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. క్వింటాలుకు మద్దతు ధర రూ.2,775గా ఉంటే.. నాణ్యత సరిగా లేదని రూ.1800 కూడా దక్కని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 64 వేల ఎకరాల్లో సజ్జలను సాగు చేశారు.
Similar News
News April 4, 2026
చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

AP: పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని CM చంద్రబాబు MLAలకు తేల్చిచెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తే ఎంతటి వారినైనా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రీసెంట్‌గా నరసారావుపేట MLA అరవింద బాబు తనకు కావాల్సిన వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వలేదని రచ్చ చేసిన నేపథ్యంలో CM ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, పార్టీకి చెడ్డపేరు తెచ్చే పనులు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
News April 4, 2026
‘హేమ్లిచ్ మెన్యువర్’ ఎలా చేయాలంటే?

ఆహారం లేదా ఇతర వస్తువులు గొంతులో చిక్కుకొని శ్వాస ఆడక <<19562187>>ఇబ్బంది<<>> పడటం ప్రాణాంతకం కావచ్చు. ఇలాంటి సమయాల్లో ‘హేమ్లిచ్ మెన్యువర్’ అనే ప్రథమ చికిత్స బాధితుడి ప్రాణాలను కాపాడుతుంది. బాధితుడి వెనుక నిలబడి, వారి పొత్తికడుపు పైభాగంలో బలంగా నొక్కాలి. చేతులను పిడికిలిలా బిగించి, లోపలికి & పైకి వేగంగా నెట్టడం ద్వారా గాలి పీడనం పెరిగి అడ్డుపడిన వస్తువు బయటకు వస్తుంది.
News April 4, 2026
ఎల్లోతో ప్రేమలో పడిపోయా.. మీనా ఫొటో వైరల్

తొలిసారి ప్రత్యక్షంగా క్రికెట్ మ్యాచ్ వీక్షించినట్లు నటి మీనా తెలిపారు. నిన్న CSK-PBKS మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో దిగిన ఫొటోను Xలో షేర్ చేశారు. ‘తొలిసారి లైవ్ చూశా. ఎల్లో(CSK)తో లవ్‌లో పడిపోయా’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఎప్పటికీ తరగని అందం ఆమెదని కొందరు కామెంట్ చేయగా, CSKలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటూ మరికొందరు ఆరా తీశారు. 90sలో వెలుగు వెలిగిన మీనా సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘దృశ్యం’తో అదరగొట్టారు.


