News December 1, 2025

పాఠకులు గ్రంథాలయాన్ని వాడుకుంటే మంచి ఫలితాలు: కలెక్టర్

image

PDPL జిల్లా గ్రంథాలయాన్ని సోమవారం సందర్శించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష పాఠకులకు అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువుకు అనుకూల వాతావరణం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు సమయపాలన పాటించి, గ్రంథాలయాన్ని సక్రమంగా ఉపయోగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ మోటివేట్ చేశారు.

Similar News

News March 14, 2026

పవన్ ‘అడవి తల్లి బాట’ వెనుక ప్రత్యేక వ్యూహం!

image

AP: పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని JSP చీఫ్ పవన్ ఇవాళ పాడేరు ఏజెన్సీలో నిర్వహించి ‘అడవితల్లి బాట’ చేపట్టారు. ఆయన కొంతకాలంగా ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టిసారించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ సాగుతోంది. 2019లో 7 ST నియోజకవర్గాలను గెల్చుకొని ఏజెన్సీలో YCP పట్టుబిగించింది. 2024లో కూటమి జోరులోనూ 2సీట్లు గెల్చుకుంది. YCPకి చెక్ పెట్టేలా పవన్ తరచూ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.

News March 14, 2026

కొత్తవలస: యాక్సిడెంట్.. లారీ డ్రైవర్ మృతి

image

కొత్తవలస మండలం కంటకాపల్లి రైల్వే సైడింగ్ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. ఎల్.కోట మండలంలో ఓ కంపెనీకి చెందిన లారీ డ్రైవరు బొగ్గు లోడింగ్ కోసం కంటకాపల్లి రైల్వే సైడింగ్‌కు వచ్చాడు. లారీ డ్రైవరు లారీకి టార్పాలిన్ కడుతూ ఉండగా జారిపోయి పడిపోయాడు. ఆ సమయంలో అటుగా మరోలారీ రావడంతో ఆ లారీ కిందపడి మృతి చెందాడు.

News March 14, 2026

యుద్ధం ఎఫెక్ట్.. చిత్తూరు జిల్లాలో పెరిగిన వాటర్ బాటిల్ ధరలు?

image

చిత్తూరులో శనివారం జిల్లా <<19383334>>వాటర్<<>> అసోసియేషన్ ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. యుద్ధ ప్రభావంతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీకి అవసరమైన రా మెటీరియల్ ధరలు భారీగా పెరిగాయని తయారీదారులు అంటున్నారు. దీని వలన తమపై అధిక భారం పడుతోందని, దీంతో వాటర్ బాటిల్ ధరలను తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పెంచిన ధరలకు డీలర్లు సహకరించాలని జిల్లా వాటర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.