News December 1, 2025
అధికారులకు బాపట్ల కలెక్టర్ ఆదేశాలు

దిత్వా తుఫాను కారణంగా పంట నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 10 శాతం కూడా వరి కోత అవలేదని, వరి దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలన్నారు. డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉంచి, మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులతో కూడిన టీమ్‌ను ఏర్పాటు చేసి, ప్రణాళిక ప్రకారం పనిచేయాలని సూచించారు.
Similar News
News March 24, 2026
IPL: అత్యల్ప స్కోరు ఆర్సీబీదే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) రికార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ పేరిట <<19457522>>ఉంటే<<>>.. అత్యల్ప స్కోర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నమోదు చేసింది. 2017లో కోల్‌కతా(KKR)పై బెంగళూరు (RCB) చేసిన 49 రన్స్ నేటికీ లీగ్ చరిత్రలో అత్యల్పం. ఆ తర్వాత వరుసగా రాజస్థాన్ రాయల్స్ (58, 59), ఢిల్లీ (66, 67) పరుగులతో ఉన్నాయి. 2008లో ముంబై బౌలర్ల ధాటికి KKR కూడా 67 పరుగులకే కుప్పకూలింది.
News March 24, 2026
పశ్చిమాసియా సంక్షోభం.. కేంద్ర మంత్రుల కీలక భేటీ

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పార్లమెంటు హౌస్‌లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కీలక భేటీ జరుగుతోంది. ఈ మీటింగ్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఎరువుల మంత్రి నడ్డా హాజరయ్యారు. మరోవైపు ఇదే అంశంపై రేపు ఆల్ పార్టీ మీటింగ్‌కు కేంద్రం <<19464829>>పిలుపునిచ్చిన<<>> విషయం తెలిసిందే.
News March 24, 2026
13 నూతన అంబులెన్సుల కొనుగోలు.. టెండర్లకు ఆహ్వానం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మెరుగుపరిచేందుకు 13 నూతన అంబులెన్సులను కొనుగోలు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్, జిల్లా కొనుగోలు కమిటీ చైర్మన్ తిరుమాని శ్రీ పూజ తెలిపారు. నీతి ఆయోగ్ నిధులతో సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో ఈ అంబులెన్సులు కొనుగోలు చేయనున్నారు. టెండర్ ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.


