News December 1, 2025
జగిత్యాల: ‘ఈ సంవత్సరం 83 కేసులు నమోదు’

ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల కలెక్టరేట్ నుంచి మెడికల్ కాలేజీ వరకు నిర్వహించిన ర్యాలీని అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్ ప్రారంభించారు. ఎయిడ్స్‌కు నివారణే మేలని, యువత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో 2,573 మంది ఏఆర్‌టి చికిత్స పొందుతున్నారని వైద్య అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం 83 కేసులు నమోదయ్యాయని చెప్పారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.
Similar News
News March 22, 2026
మచిలీపట్నంలో కేజీ చికెన్ ధర రూ.390!

మచిలీపట్నం మాంసం మార్కెట్‌లలో ఆదివారం ధరలు భగ్గుమన్నాయి. సెలవు దినం కావడంతో మార్కెట్లు రద్దీగా ఉన్నప్పటికీ, ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పట్టణంలో చికెన్ స్కిన్‌లెస్ రూ. 390 పలుకుతోంది. మటన్ కిలో రూ.1000కి చేరగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.800గా ఉంది. చేపల మార్కెట్‌లో బొచ్చె రూ. 200, సీలావతి రూ. 170కి విక్రయిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 22, 2026
కాకతీయుల దూరదృష్టి.. భావితరాలకు ప్రయోజనం..!

ఓరుగల్లు ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయ రాజుల దూరదృష్టి భావితరాలకు ప్రయోజనం చేకూరుస్తోంది. గణపతి దేవుడు, రేచర్ల రుద్రుడు, రుద్రదేవుడు, ప్రోలరాజు క్రీ.శ 1200 సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జలాశయాలు, గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. ప్రధానంగా రామప్ప, లక్నవరం, పాకాల, గణప సముద్రం తదితర సరస్సులు నేటికీ చెక్కుచెదరలేదు. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయి.
#నేడు ప్రపంచ జల దినోత్సవం.
News March 22, 2026
HYD: రేపటి నుంచి లైఫ్ ట్యాక్స్ రద్దు

అదనపు వాహనాలు కొనుగోలు చేసే వారికి పడే 2% లైఫ్ ట్యాక్స్‌ను ఈ నెల 23 నుంచి రద్దు చేస్తున్నట్లు HYDలోని అధికారులు తెలిపారు. ఈ మేరకు వాహన్ పోర్టల్ అందుబాటులోకి రానుందని అన్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తారని దీని ద్వారా దేశంలో ఉన్న అన్ని వాహనాల వివరాలు ఒకే గొడుగు కిందికి రానున్నాయని వెల్లడించారు. 2% పన్ను ఎత్తివేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
# SHARE IT


