News December 1, 2025

రంప ఏజెన్సీలో హై అలర్ట్!

image

డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టులు PLGA వారోత్సవాలకు పిలుపునిచ్చారు. ఈ వారోత్సవాలలో ఎన్‌కౌంటర్లలో మృతిచెందిన మావోయిస్టులకు ఆ పార్టీ శ్రేణులు నివాళులు అర్పిస్తారు. ఏటా ఈవారోత్సవాలు జరగడం, పోలీసులు అప్రమత్తంగా ఉండడం సాధారణమే అయినప్పటికీ, ఇటీవల జరిగిన మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ల నేపథ్యంలో ఈసారి రంప ఏజెన్సీలో మరింత హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

Similar News

News March 23, 2026

HYD మెట్రో టేకోవర్.. ‘జర్మనీ కోచ్‌’లకు పెయింట్!

image

ఫేజ్-1 బదిలీ తర్వాత ఆర్థిక భారం తగ్గించుకోవడానికి జర్మనీ నుంచి 24 రిఫర్బిష్డ్ కోచ్‌లను లీజుకు తీసుకోవాలని అంతర్గత నిర్ణయం జరిగింది. కొత్త కోచ్‌ల కొనుగోలుకు బదులుగా వీటిని రీ-పెయింట్ చేసి వాడబోతున్నారు. IDBI క్యాపిటల్ దీనికి సంబంధించిన అసెట్ వాల్యుయేషన్ నివేదిక ఇచ్చింది. ఆస్తుల బదిలీ ప్రక్రియ మార్చి 31తో ముగియనుంది. నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ నోడల్ ఏజెన్సీకి అప్పగించే ఫైల్ క్లియరెన్స్ దశలో ఉంది.

News March 23, 2026

RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

RITES లిమిటెడ్‌ 5 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్, అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సర్వేయర్, CA/ICWA/CFA/MBA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. మార్చి 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://rites.com/

News March 23, 2026

షాపింగ్‌లో మోసపోయారా?

image

ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొన్న వస్తువులు పాడైపోయినా, రిటర్న్ తీసుకోవడంలో లేదా వారంటీ పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? వినియోగదారుల ఫోరమ్ ద్వారా మీరు న్యాయం పొందవచ్చు. క‌న్జూమ‌ర్ హెల్ప్‌లైన్ నంబర్ 1915కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. అలాగే ‘8800001915’ నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ పంపి కూడా కంప్లైంట్ ఇవ్వొచ్చు. <>వెబ్‌సైట్‌లోనూ<<>> మీ సమస్యను తెలియజేస్తే వేగంగా పరిష్కారం లభిస్తుంది.