News December 1, 2025
WGL: మార్కెట్‌కి పల్లికాయ రాక.. ధర ఎంతంటే..?

చాలా రోజుల అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పల్లికాయ తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పచ్చి పల్లికాయ రూ.6,350 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే మొక్కజొన్నకు రూ. 1,935 ధర వచ్చిందన్నారు. గతవారం మక్కలు బిల్టికి రూ.2000 పైగా ధర రాగా.. నేడు ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.
Similar News
News March 20, 2026
వెయిట్ లాస్ మందుల ధర తగ్గించిన నాట్కో

అధిక బరువుతో బాధపడేవారికి NATCO గుడ్ న్యూస్ చెప్పింది. నోవో నార్డిస్క్ పేటెంట్ గడువు ముగియడంతో సెమాగ్లుటైడ్ జెనరిక్ వెర్షన్‌ను అత్యంత చౌకగా మార్కెట్లోకి తెచ్చింది. SEMANATTM, SEMAFULLTM బ్రాండ్ల పేరుతో లభించే మల్టీ-డోస్ వయల్స్ ధరను కేవలం ₹1,290గా నిర్ణయించింది. ఇది అసలు బ్రాండ్ ధర కంటే దాదాపు 90% తక్కువ కావడం విశేషం. ఏప్రిల్‌లో పెన్ డివైజ్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
News March 20, 2026
పోలవరం: గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు

ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కొల్లుగూడెం ఇసుక ర్యాంప్ సమీప గోదావరిలో శుక్రవారం ఐదుగురు యువకులు గల్లంతు అయ్యారని స్థానికులు తెలిపారు. భద్రాచలానికి చెందిన ఏడుగురు యువకులు గోదావరిలో స్నానానికి దిగగా వారిలో ఐదుగురు మునిగి పోయారని, ఇద్దరు ఒడ్డుకు వచ్చారని కూనవరం గ్రామస్థులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 20, 2026
VJA: VMC ప్రత్యేక అధికారిగా కలెక్టర్ లక్ష్మిశా బాధ్యతలు

విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ లక్ష్మిశా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల మున్సిపల్ కౌన్సిళ్ల పదవీకాలం ముగియడంతో అన్ని కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులను నియమించిన నేపథ్యంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. నగరంలో కీలకమైన అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, నిరంతర తాగునీటి సరఫరా, పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.


