News December 1, 2025
త్వరలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ: మంత్రి దుర్గేశ్

సినిమా షూటింగ్‌లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా APని నిలుపుతామని మంత్రి దుర్గేశ్ అన్నారు. ‘త్వరలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీని ఆవిష్కరిస్తాం. మీడియా, ఎంటర్టైన్‌మెంట్ రంగంలో పెట్టుబడులు పెడితే ప్రోత్సాహం కల్పిస్తాం. కలిసి పనిచేసి తెలుగు సినీ పరిశ్రమలో నూతన అధ్యాయం సృష్టిద్దాం. నంది అవార్డుల ప్రదానోత్సవం, నాటకోత్సవాలను త్వరలోనే నిర్వహిస్తాం’ అని ముంబైలో ‘CII బిగ్ పిక్చర్ సమ్మిట్’లో వెల్లడించారు.
Similar News
News December 3, 2025
‘పంచాయతీ’ పోరుకు యువత జై!

TG: పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచినవారిలో యువతే అధికంగా ఉన్నారు. పెద్దలకే పరిమితం అనుకున్న పాలిటిక్స్‌లో తమ మార్క్ చూపించేందుకు యంగ్ జనరేషన్ పోటీ పడుతోంది. రెండు విడతల్లో 70శాతానికి పైగా నామినేషన్లలో 30-44 ఏళ్ల వారే ఉండటం దీనికి నిదర్శనం. సర్పంచ్ బరిలో 60%, వార్డు సభ్యుల్లో 75శాతానికి పైగా పోటీలో ఉన్నట్లు సమాచారం. తమ గ్రామాలను అభివృద్ధి చేస్తామని పలు చోట్ల ఉద్యోగాలు వదిలేసి బరిలోకి దిగుతున్నారు.
News December 3, 2025
నేడు రెండు జిల్లాల్లో సీఎం పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. 10.55AMకు తూ.గో. జిల్లా నల్లజర్లలో జరగనున్న ‘రైతన్నా.. మీ కోసం’ వర్క్ షాప్‌లో ఆయన పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక సభలో రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 1.45PM నుంచి 3.15PM వరకు కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. 6PMకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకొని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు.
News December 3, 2025
రేపే దత్త జయంతి.. ఏం చేయాలంటే?

త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయస్వామి. అందుకే ఆయనకు 3 తలలుంటాయి. రేపు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయనను పూజిస్తే.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆరాధనా ఫలితం దక్కుతుందని నమ్మకం. ఆయన చిత్రపటం, విగ్రహానికి పసుపు రంగు పూలతో అలంకరించి, పులిహోరా, నిమ్మకాయలు వంటి పసుపు రంగు నైవేద్యాలు సమర్పిస్తే.. శని బాధలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. ఈ పవిత్రమైన రోజున ఆయన అనుగ్రహం పొందితే జీవితంలో శుభాలు కలుగుతాయి.


