News December 1, 2025

జిల్లా వ్యాప్తంగా నెలరోజులు పోలీసు యాక్ట్ అమలు

image

శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజుల(డిసెంబర్ 1వ తేది నుంచి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరదాని, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగించారాదని పేర్కొన్నారు.

Similar News

News March 8, 2026

WBలో ప్రొటోకాల్ వివాదం.. అమిత్ షా, CBN ఏమన్నారంటే

image

ప.బెంగాల్‌లోని TMC ప్రభుత్వం తమ అరాచక ప్రవర్తనతో అథఃపాతాళానికి దిగజారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ‘ప్రోటోకాల్‌ పాటించకుండా రాష్ట్రపతిని అవమానించారు. <<19322594>>ఈ ఘటన<<>> దేశానికి, ప్రజాస్వామ్యానికి అవమానం’ అని ట్వీట్ చేశారు. రాష్ట్రపతిని అవమానించేలా WB ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని, ఈ ఘటన బాధ కలిగించిందని AP CM CBN తెలిపారు. రాష్ట్రపతి పట్ల గౌరవంతో మెలగాలన్నారు.

News March 8, 2026

NZB: 246 కేసులు.. రూ 20.30 లక్షల జరిమానా: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 246 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. కేసుల్లో పట్టుబడిన వారిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.20.30 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 16 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.

News March 8, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 8)

image

1897: చిత్రకారుడు దామెర్ల రామారావు జననం
1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం
1989: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జననం
1993: చిలకలూరిపేట బస్సు దహనం ఘటనలో 23 మంది మృతి
2012: సినీ నటి రాధాకుమారి మరణం
☛ అంతర్జాతీయ మహిళా దినోత్సవం