News December 1, 2025
WGL: ఏసీబీ అధికారి పేరుతో మోసంచేసే ముఠా అరెస్టు

ఏసీబీ డీఎస్పీ అంటూ ప్రభుత్వ అధికారులను బెదిరించి, వసూళ్లకు పాల్పడుతున్న ఐదుగురి ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. రాచంపల్లి శ్రీనివాస్, నవీన్, రవీందర్, మురళీ, ప్రసన్నలను అరెస్టు చేసినట్లు CP సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ ముఠా 19మంది ప్రభుత్వ అధికారులను బెదిరించి, సుమారు రూ. 50 లక్షలు వసూలు చేసినట్లు సీపీ తెలిపారు. వారి నుంచి 13 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
Similar News
News March 23, 2026
దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న MLA దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని బీజేపీ MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. దీనిపై 4 వారాల్లో వివరణ ఇవ్వాలని దానంతోపాటు అసెంబ్లీ సెక్రటరీకి ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
News March 23, 2026
గుంటూరులో పబ్లిక్ సర్వే గణాంకాలపై అనుమానాలు

గుంటూరు జిల్లాలో పబ్లిక్ పర్సెప్షన్ సర్వే గణాంకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విభాగాలు చూపిస్తున్న సంఖ్యలు క్షేత్రస్థాయిలో సరిపోవడం లేదని అధికారులు గుర్తించారు. మార్గదర్శకుల సంఖ్య, రైతు సేవలు వంటి అంశాల్లో వాస్తవ పురోగతి తక్కువగా ఉందని తేలింది. కొన్ని పథకాల అమలు గణాంకాలు అతిశయంగా చూపించినట్లు వెల్లడైంది. రైతుల ఫిర్యాదుల నమోదు కూడా తక్కువగా ఉండటం గమనార్హం.
News March 23, 2026
భద్రాద్రి రాముడిపై పంచాయితీ.. ఏంటీ వివాదం?

TG: భద్రాద్రి రామయ్యను దశరథ పుత్రుడిగా, వశిష్ట గోత్రికుడిగా, సీతమ్మది గౌతమస గోత్రంగా వ్యవహరించేవారు. 2012 తర్వాత అక్కడ ఉన్నది రామనారాయణుడంటూ గోత్రాన్ని ‘అచ్యుత’గా, సీతాదేవి గోత్రాన్ని ‘సౌభాగ్య’గా పండితులు చదువుతున్నారంటూ ఓ వ్యక్తి 2022లో హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఏర్పాటుచేసిన కమిటీ 2024లో దేవదాయ శాఖకు నివేదిక సమర్పించింది. అది బయటికి రాకపోవడంతో మళ్లీ కోర్టుకెక్కారు. ఇవాళ విచారణ జరగనుంది.


