News December 1, 2025

ఉపాధ్యాయుడిగా మారిన మంత్రి కేశవ్

image

ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉరవకొండ మండలం బూదిగవి గ్రామ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. గంటపాటు విద్యార్థులకు పాఠం చెప్పారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం ఇచ్చారు. విద్యార్థుల తెలివితేటలను చూసిన మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలలో అధిరోహించాలని విద్యార్థులకు ఆయన సూచించారు.

Similar News

News March 18, 2026

అనంతపురం మున్సిపల్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు

image

అనంతపురం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన GO 284 ప్రకారం ఈ నియామకం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. నగర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించి, పౌరులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని తెలిపారు.

News March 18, 2026

నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన

image

అనంతపురం జిల్లాలోని ఒక నగరపాలక సంస్థ, ఆరు మున్సిపాలిటీలలో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చింది. అనంతపురం నగరపాలక సంస్థకు కలెక్టర్ ఆనంద్, తాడిపత్రికి జేసీ విష్ణు చరణ్, గుత్తికి ఆర్డీవో కేశవ నాయుడు, కళ్యాణదుర్గంకు వసంతబాబు, రాయదుర్గంకు రామకృష్ణారెడ్డి, గుంతకల్‌కు శ్రీనివాసులు పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. పౌర సేవలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వీరు చేపట్టనున్నారు.

News March 18, 2026

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్

image

అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సెమినార్ హాల్లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై చర్చించారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. వారిపట్ల నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు.