News December 1, 2025
కడప: వాయిదా పడిన డిగ్రీ పరీక్ష.. మళ్లీ ఎప్పుడంటే.!

దిత్వా తుఫాను కారణంగా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ పరీక్షల తేదీలను విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు సోమవారం ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీన డిగ్రీ వారికి జరగాల్సిన పరీక్షను ఈ నెల 6వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నామన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులకు ఈనెల 9వ తేదీ ఉదయం పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.
Similar News
News March 22, 2026
కడప జిల్లాకు రానున్న వైఎస్ షర్మిల

పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 24వ తేదీన సాయంత్రం సింహాద్రిపురం మండలానికి రానుంది. ఇటీవల ఈదురుగాలులకు మండలంలోని కసనూరు గ్రామంలో నేల కూలిన అరటి తోటలను ఆమె పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆమె నష్టపోయిన రైతులతో పంట నష్ట వివరాలు, ఎంత పెట్టుబడి పెట్టారు తదితర విషయాలను అడిగి తెలుసుకోనున్నారు.
News March 22, 2026
జమ్మలమడుగు యువకుడికి ఆల్ ఇండియా ర్యాంక్

జమ్మలమడుగు (M) ఎస్. ఉప్పలపాడు గ్రామానికి చెందిన తలారి మోహన్ గేట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో మెకానికల్ ఇంజినీరింగ్ (ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్) విభాగంలో ఆల్ ఇండియా 89వ ర్యాంక్ సాధించి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు. ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మోహన్ తల్లిదండ్రులు సంజీవరాయుడు, లక్ష్మీదేవి, స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.
News March 22, 2026
ఒంటిమిట్టలో ఆక్రమణలు తొలగిస్తారా..?

ఒంటిమిట్ట కోదండరామాలయంలోని పంచాయతీ స్థలాలు ఆక్రమణలు పరిపాటిగా మారాయి. ప్రజలు, భక్తులు నడిచే కాలినడక బాటను సైతం దుకాణాల పేరుతో వదిలారన్నారు. మండల అధికార యంత్రానికి విషయం తెలిసినా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అక్రమణలపై చేయి కుడా వేయలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లను జయించి అధికార యంత్రాగం ఆక్రమణలు తొలగిస్తుందా.. లేక ఎప్పటిలాగే కళ్లుమూసుకుంటుందా వేచి చూడాలని విశ్లేషకులు అంటున్నారు.


