News December 1, 2025

ఏపీలో 10 చోట్ల వాటర్ ఏరో డ్రోమ్స్

image

APలోని 10 ప్రాంతాల్లో వాటర్ ఏరో డ్రోమ్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. సీ ప్లేన్స్ ఆపరేషన్లకు వీలుగా వీటిని ఏర్పాటు చేయనుందని చెప్పింది. అరకు, గండికోట, కాకినాడ, కోనసీమ, లంబసింగి, నరసాపూర్, ప్రకాశం బ్యారేజీ, రుషికొండ, శ్రీశైలం, తిరుపతిలలో వీటిని ఏర్పాటు చేస్తారని పేర్కొంది. కాగా సీ ప్లేన్ల ద్వారా రాకపోకలు సాగించేలా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు.

Similar News

News March 9, 2026

ఏపీలో సర్పంచ్ ఎన్నికలు.. UPDATE

image

AP: సర్పంచ్ ఎన్నికల నిర్వహణ కోసం గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన గడువును SEC పొడిగించింది. ఫిబ్రవరి 7న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ్టితో గడువు ముగియగా ఈ నెల 18 వరకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీ కాలం APR 2తో ముగియనుంది. అయితే బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం నియమించిన <<19292949>>ఏకసభ్య కమిషన్<<>> నివేదిక రావడానికి 3 నెలలు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఎన్నికలు జరగనున్నాయి.

News March 9, 2026

పెళ్లి తర్వాత షూటింగ్‌లో విజయ్ బిజీ!

image

రష్మికతో పెళ్లి కారణంగా కొన్ని రోజులు షూటింగ్‌లకు విరామం ఇచ్చిన విజయ్ దేవరకొండ మళ్లీ బిజీ కానున్నారు. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘రణబాలి’ చిత్రీకరణలో ఈ నెల 12 నుంచి పాల్గొననున్నట్లు సమాచారం. కర్నూలులో జరిగే ఈ షెడ్యూల్‌లో కీలక నటీనటులంతా పాల్గొంటారని తెలుస్తోంది. రష్మికతో కలిసి విజయ్ నటిస్తోన్న ఈ హ్యాట్రిక్ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

News March 9, 2026

చట్టసభల్లో మహిళలు 10 శాతమే!

image

దేశంలో 4,666 మంది ఎంపీలు/ఎమ్మెల్యేలు ఉంటే వారిలో మహిళల వాటా 10% (464) ఉందని ADR రిపోర్ట్ వెల్లడించింది. 543 మంది LS ఎంపీల్లో 74 (14%) మంది మహిళలు ఉన్నారు. 4,123 మంది ఎమ్మెల్యేలలో 390 (9%) మంది మహిళలే ఉన్నారు. బీజేపీలో (31), కాంగ్రెస్ (13), తృణమూల్ (11)లో అత్యధిక మహిళా MPలు ఉన్నారు. అటు ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 1957 LS పోల్స్‌లో 45 మందే ఉండగా 2024లో అది 800కు చేరింది.