News December 1, 2025

2 నెలల్లో AI యూనివర్సిటీ ప్రారంభం: శ్రీధర్ బాబు

image

TG: మరో 2నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సిటీని ప్రారంభించనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఇంజినీరింగ్ చదువులు పూర్తిచేసే విద్యార్థులకు దీని ద్వారా నూతన నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తామని తెలిపారు. ఏఐ సాంకేతిక దూకుడుతో వారంతా నైపుణ్యాలను పెంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. HYDలో కోవాసెంట్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్‍‌ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు.

Similar News

News March 16, 2026

విస్తారంగా వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. అమీర్‌పేట, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, సనత్ నగర్ తదితర ఏరియాల్లో వర్షం కురిసింది. TGలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, APలోని అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడా వానలు పడుతున్నాయి. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది? కామెంట్ చేయండి.

News March 16, 2026

‘మధుబాల’గా మెప్పించనున్న సాయిపల్లవి?

image

‘ఏక్ దిన్’ సినిమాతో <<19355627>>బాలీవుడ్‌లో<<>> అడుగుపెట్టనున్న సాయి పల్లవి మరో హిందీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించనున్న అలనాటి బ్యూటీ క్వీన్ మధుబాల బయోపిక్ కోసం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం సాయి పల్లవి రామాయణ మూవీతోపాటు ధనుష్ సినిమాతో బిజీగా ఉన్నారు.

News March 16, 2026

నేడు అమరావతిలో ‘అమరజీవి’ విగ్రహావిష్కరణ

image

AP: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి నేడు. 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినందుకు గుర్తుగా అమరావతిలోని తుళ్లూరులో 58 అడుగుల విగ్రహాన్ని CM చంద్రబాబు నేడు ఆవిష్కరించనున్నారు. ₹150 కోట్ల అంచనా వ్యయంతో 6.8 ఎకరాల్లో చేపట్టిన స్మృతి వనం తొలి దశ పనులు పూర్తయ్యాయి. రెండో దశలో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌‌మెంట్ సెంటర్ నిర్మిస్తారు.