News December 1, 2025
ఇన్‌స్టాగ్రామ్‌తో పిల్లల్ని పెంచడం కరెక్టేనా?

పిల్లల ఫుడ్ నుంచి హెల్త్ వరకు పేరెంట్స్ ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌నే ఫాలో అవుతున్నారు. ఈ Instagram పేరెంటింగ్ కొన్నిసార్లు ఫర్వాలేదు కానీ, ప్రతిసారీ, ప్రతి కిడ్‌కూ సెట్ కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి బేబీ లైఫ్, పరిస్థితులు, బిహేవియర్ ప్రత్యేకం కాబట్టి మన పెద్దలు, డాక్టర్ల సలహా పాటించడం మంచిదని సూచిస్తున్నారు. IG టిప్స్‌తో రిజల్ట్స్ తేడా అయితే మనం ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.
Similar News
News December 1, 2025
మక్తల్ ప్రజా విజయోత్సవాలు ముఖ్యాంశాలు

✓మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వెంటనే ఆమోదం.
✓5 వేల కోట్లుతో లక్ష ఎకరాలకు నీరందించనున్న ప్రాజెక్ట్‌పై మంత్రి శ్రీహరి ధన్యవాదాలు.
✓మక్తల్‌కు 50 కోట్లతో హాస్పిటల్ ఆమోదం.
✓మక్తల్–నారాయణపేట మధ్య 210 కోట్లతో నాలుగు లైన్ల రోడ్ మంజూరు.
✓పర్యాటక, దేవాలయాల అభివృద్ధికి జూపల్లి కృష్ణారావు నిధుల కేటాయింపు.
✓మక్తల్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకురావాలని మంత్రి శ్రీహరి హామీ.
News December 1, 2025
TGకి ఐదేళ్లలో రూ.3.76Lకోట్ల నిధులిచ్చాం: కేంద్రం

తెలంగాణకు గత ఐదేళ్లలో రూ.3,76,175 కోట్ల నిధులు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. BJP MP అరవింద్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్లు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా వివిధ పద్ధతుల్లో నిధులు విడుదల చేశామన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రాబడి కింద రూ.4,35,919Cr వచ్చాయని తెలిపారు.
News December 1, 2025
వైకుంఠద్వార దర్శనం.. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్‌ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్లకు రేపు మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తారు.


