News December 1, 2025

సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల రెండో విడత ఆర్వోలకు శిక్షణ

image

రెండో విడత పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సిరిసిల్లలోని కలెక్టరేట్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ప్రతి ఆర్‌ఓ వ్యవహరించాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదేశించారు. నామినేషన్ల దాఖలు నుంచి లెక్కింపు వరకు అప్రమతంగా ఉండాలన్నారు.

Similar News

News March 10, 2026

గర్భాశయ క్యాన్సర్ నివారణకు టీకాలు: కలెక్టర్

image

9 నుంచి14 ఏళ్ల మధ్య వయస్సు గల బాలికలకు HPVటీకా వేయించడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను పూర్తిగా నివారించవచ్చని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మంగళవారం నంద్యాలలోని గాంధీనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. HPV టీకాపై తల్లిదండ్రులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News March 10, 2026

మస్కట్‌లో ముస్తాబాద్ యువకుడి మృతి

image

ఉపాధి కోసం విదేశం వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ముస్తాబాద్ మండలంలోని బట్టోనితండాకు చెందిన రాగం ప్రశాంత్(28) రెండేళ్ల క్రితం మస్కట్ వెళ్లాడు. శనివారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందగా, సోమవారం అతని సోదరుడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని బంధువులు కోరుతున్నారు.

News March 10, 2026

పోలీస్ వ్యవస్థకు యువత నవ చైతన్యం: ఐజీ

image

పోలీస్ వ్యవస్థలోకి వస్తున్న యువత నవ చైతన్యం వంటి వారని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం పెదవేగిలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, చిత్తూరు జిల్లాకు చెందిన 142 మంది ట్రైనీ కానిస్టేబుళ్లతో మాట్లాడారు. శిక్షణ కాలంలో శారీరక దృఢత్వంతో పాటు BNS, BNSS వంటి నూతన చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, సేవా దృక్పథంతో ప్రజలకు చేరువ కావాలని ఆయన సూచించారు.