News December 1, 2025

కృష్ణా: తుఫాన్ ప్రభావంతో అపరాల సాగు ఆలస్యమే.!

image

దిత్వా తుఫాన్ ప్రభావం కృష్ణా డెల్టా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సాధారణంగా వరి కోత అనంతరం రెండో పంటగా సాగుచేసే అపరాల సాగుకు నవంబర్ నెలలోనే పనులు ప్రారంభమవుతాయి. అయితే తుఫాన్ నేపథ్యంతో వరికోతలు నిలిచిపోవడంతో, అపరాల సాగు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. రెండో పంట ఆలస్యమవ్వడంతో దిగుబడి కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News March 21, 2026

హనుమకొండ జిల్లాలో పెరిగిన అటవీ విస్తీర్ణం

image

జిల్లాలో అటవీ విస్తీర్ణం పరిమితంగా ఉంది. సుమారు 4 వేల ఎకరాలు ఉండగా 0.20 శాతం విస్తీర్ణం పెరిగినట్లు అంచనా. జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లోని ఇనుపరాతి గుట్టల పరిధిలో అడవులు విస్తరించాయి. ముఖ్యంగా దేవనూరు అటవీ ప్రాంతంలో ఈ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, కుందేళ్లు తదితర వన్యప్రాణులు సంచరిస్తున్నాయి.
# నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.

News March 21, 2026

అమలాపురం: లభ్యం కానీ గల్లంతైన విద్యార్థి ఆచూకీ

image

అమలాపురం మండలంలోని ఓడలరేవు సముద్ర తీరంలో గల్లంతైన ఇంటర్ విద్యార్థి దొమ్మేటి లోకేశ్ ఆచూకీ కోసం శనివారం రెండో రోజూ గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అమలాపురం ప్రభాకర్ నగర్‌కు చెందిన నలుగురు విద్యార్థులు సరదాగా స్నానానికి వెళ్లగా, అలల ఉధృతికి అందరూ గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా, లోకేశ్ గల్లంతైన సంగతి తెలిసిందే. అధికారుల పర్యవేక్షణలో గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

News March 21, 2026

పుట్టపర్తి: పోలీసుల పటిష్ఠ బందోబస్తు

image

శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో పవిత్ర రంజాన్ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. ప్రార్థన మందిరాలు, మసీదులు వద్ద సిబ్బందిని నియమించారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత సాఫీగా అందరూ వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.