News December 1, 2025

నేతివానిపల్లి సర్పంచ్‌ అభ్యర్థిగా తిరుపతమ్మ నామినేషన్

image

మల్దకల్ మండలం నేతువానిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి మహిళా నాయకురాలు తిరుపతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, గ్రామ ప్రజలు ఏకతాటిపైకి వచ్చి సహకరించాలని కోరారు. అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కును అమ్ముకోకుండా నిజాయితీ గల వారికి ఓటు వేయాలన్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు తిమ్మప్ప, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 20, 2026

ఆదిలాబాద్: చెరువు మట్టితో చేనుకు లాభం

image

ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చెరువుల పూడికతీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వేసవి నేపథ్యంలో కూలీలకు చేతినిండా పని దొరకడంతో పల్లెల్లో సందడి నెలకొంది. చెరువుల్లోని సారవంతమైన నల్లమట్టిని రైతులు పోటీపడి తమ పొలాలకు తరలిస్తున్నారు. ఈ పనులతో భూగర్భ జలాలు పెరగడమే కాకుండా, సాగు భూములకు బలం చేకూరుతోంది. పని ప్రదేశాల్లో కూలీలకు ఇబ్బంది కలగకుండా నీడ, తాగునీరు వంటి సౌకర్యాలను అధికారులు కల్పిస్తున్నారు

News March 20, 2026

నాగార్జునసాగర్ చేపల ఫ్రై రుచికి పర్యాటకులు ఫిదా

image

నాగార్జునసాగర్ జలాశయం తాజా చేపల వంటకాలకు పెట్టింది పేరు. ఇక్కడ దొరికే చేపలతో చేసే స్పెషల్ ఫ్రై రుచికి స్థానికులతో పాటు వెయ్యి మందికి పైగా పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. ప్రత్యేక మసాలాలతో వేయించిన ఈ చేపలకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. సాగర్ రోడ్డు వెంట ఉన్న సుమారు 10 హోటళ్లు, స్టాళ్లలో తాజాగా పట్టిన చేపలను విక్రయిస్తున్నారు. సాగర్ సందర్శనకు వచ్చే వారు ఈ అమోఘమైన రుచిని అస్సలు వదులుకోవడం లేదు.

News March 20, 2026

నల్గొండ కేవీలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

నల్గొండ పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఒకటో తరగతి, బాలవాటిక-3లో చేరేందుకు ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. అలాగే 2 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీల ఆధారంగా ఏప్రిల్ 2 నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆసక్తి గల తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.