News December 1, 2025
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ స్నేహ

హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ధర్మసాగర్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లు, ట్రక్కుల రవాణా, ఓపీఎంఎస్ ఎంట్రీల వివరాలను సమీక్షించారు. రైతుల సమస్యలు తెలుసుకుని, వారి ఖాతాల్లో డబ్బులు త్వరగా జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Similar News
News March 24, 2026
VKB: లోక్ అదాలత్‌తో వివాదాలకు స్వస్తి: ఎస్పీ

న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు ఈ నెల 28న నిర్వహించనున్న ‘జాతీయ లోక్ అదాలత్’ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పిలుపునిచ్చారు. ఆమె మాట్లాడుతూ.. రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులను పరస్పర అంగీకారంతో ఇక్కడ పరిష్కరించుకోవచ్చన్నారు. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా ఉభయ పక్షాల మధ్య సఖ్యత పెరుగుతుందని పేర్కొన్నారు.
News March 24, 2026
విశాఖ విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్

రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ మంగళవారం విశాఖ విచ్చేశారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంక బ్రత బాగ్చి స్వాగతం పలికారు. అనంతరం నగరంలోకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు రాత్రి హోటల్లో బస చేసి, రేపు ఉదయం10 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్‌లో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం విశాఖ నుంచి బయలుదేరి విజయవాడ పయనమవుతారు.
News March 24, 2026
మార్కాపురం నూతన కలెక్టర్ బాధ్యతలకు తాత్కాలిక బ్రేక్

అనివార్య కారణాల వలన బుధవారం మార్కాపురం నూతన జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాల్సిన విజయ సునీత జాయినింగ్ తాత్కాలికంగా వాయిదా పడినట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి తెలియజేశారు. ముందుగా రేపు మార్కాపురం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపిన అధికారులు.. ఆమె జాయినింగ్ వాయిదా పడినట్లు వివరించారు. మళ్లీ బాధ్యతల స్వీకరణ ఎప్పుడు అనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామన్నారు.


