News December 1, 2025
రైతులు అప్రమత్తంగా ఉండాలి: శ్రీకాకుళం కలెక్టర్

దిత్వా తుఫాను సందర్భంగా రైతులు తమ పంటలపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కొన్ని మండలాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. జిల్లాకు దిత్వా తుఫాను ప్రభావం లేనప్పటికీ జిల్లా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Similar News
News March 22, 2026
శ్రీకాకుళం: ‘మహిళల కోసం పింక్ టాయిలెట్స్’

శ్రీకాకుళం జిల్లాకు ఆర్టీసీ బస్సు స్టాండ్ సమీపంలోని డే అండ్ నైట్ కూడలి మార్గంలో ఉమెన్స్ కాలేజీ వద్ద మహిళల కోసం ఫీడింగ్ రూమ్, పింక్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే శంకర్ శనివారం రాత్రి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..పలు ప్రాంతాల నుంచి శ్రీకాకుళానికి బస్సుల్లో పనులు నిమిత్తం వస్తున్న మహిళల ఇబ్బందుల దృష్ట్యా వీటిని ఏర్పాటు చేశామన్నారు.
News March 22, 2026
పలాస: ప్రసవం తర్వాత బాలింత మృతి..!

పలాస CHCలో బాలింత మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. పలాస(M) దానకొరకు చెందిన మీనా ప్రభుత్వాసుపత్రిలో ఉదయం 9 గం.కు రెండో బిడ్డకు జన్మనిచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంటకు మీనా మెలకువలోకి వచ్చింది. కాసేపటికే ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. వైద్యలు వివిధ పరీక్షలు చేసి చికిత్స అందించినా రక్షించలేకపోయారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, కార్బొఎంబోలిజం కారణంగా మృతిచెందిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ పాపినాయుడు తెలిపారు.
News March 22, 2026
జగన్ హయాంలో ఏపీకి ఆర్థిక నష్టం: రామ్మోహన్ నాయుడు

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీకి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన తీవ్ర నష్టాన్ని కూటమి ప్రభుత్వం సరిచేస్తుందని చెప్పుకొచ్చారు. సైకో జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం అరసవిల్లిలో ఓ కార్యక్రమంలో రామ్మోహన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.


