News December 1, 2025

ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పీఆర్‌ఓగా ఆదిరెడ్డి నియామకం

image

సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పౌర సంబంధాల అధికారిగా (పీఆర్‌ఓ) జర్నలిజం విభాగానికి చెందిన అధ్యాపకుడు రక్కిరెడ్డి ఆదిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. సుంకరి జ్యోతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఆర్‌ఓగా నియమితులైన ఆదిరెడ్డిని వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, జితేందర్, హరికుమార్, ఇతర అధ్యాపకులు అభినందించారు.

Similar News

News March 15, 2026

సిలిండర్ డోమ్ ఆకారంలోనే ఎందుకు?

image

LPG గ్యాస్‌ను సిలిండర్‌లో చాలా ఎక్కువ ఒత్తిడి వద్ద నింపుతారు. చతురస్రం లేదా దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటే మూలల వద్ద ఒత్తిడి ఎక్కువై పేలిపోయే ప్రమాదం ఉంటుంది. డోమ్ ఆకారంలో ఒత్తిడి అన్ని వైపులా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగే సిలిండర్లను దొర్లించడం సులభం అవుతుంది. కార్మికులు మోయాల్సిన బాధ తప్పుతుంది. పూర్తిగా గుండ్రంగా ఉంటే ఒకచోట నిలపడం కష్టం. తయారీ ఖర్చు కూడా తక్కువ.

News March 15, 2026

శ్రీకాకుళం: రేపటి నుంచి ఒంటి పూట బడులు

image

వేసవ తీవ్రత దృష్ట్యా మార్చి 16 నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవి బాబు ఆదివారం తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ జీవో జారీ చేశారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు రేపటి నుంచి ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.

News March 15, 2026

కార్మికులంతా విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి: కలెక్టర్

image

జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. కార్మికులకు నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, ఆరోగ్య సేవలను స్వయంగా సమీక్షించారు. అనారోగ్య లక్షణాలున్న వారికి తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కార్మికులంతా విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.