News December 1, 2025

PDPL: హెచ్‌‌ఐవీ నివారణలో సేవలందించిన వైద్య సిబ్బందికి సత్కారం

image

PDPL జిల్లాలో హెచ్‌‌ఐవీ నివారణలో విశేషంగా సేవలందించిన వైద్య సిబ్బంది డా.సింధూర, కౌన్సిలర్ సత్యానందం, ల్యాబ్ టెక్నీషియన్లు సుకుమార్, రాజేష్ తదితరులకు DMHO డా.వాణిశ్రీ ప్రశంసాపత్రాలు అందజేశారు. వ్యాసరచన పోటీల్లో గెలిచిన విద్యార్థులను కూడా సత్కరించారు. ఏఆర్‌టీ మందులు రామగుండం ఆసుపత్రిలో ఉచితంగా లభిస్తున్నాయని DMHO తెలిపారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, ఎన్జీఓలు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.

Similar News

News March 7, 2026

సివిల్స్ ర్యాంకర్ రామును అభినందించిన అచ్చెన్న

image

జి. సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రాము సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 463వ ర్యాంకు సాధించడం పట్ల వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రాము కష్టపడి చదివి ఈరోజు సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కృషి ఉంటే ఎలాంటి పరిస్థితులులోనైనా ఉన్నత స్థాయిలో రాణించవచ్చన్నారు.

News March 7, 2026

ప.గో: చంద్రబాబు తప్పిదంతోనే డయాఫ్రం వాల్‌కు నష్టం.. వైసీపీ ట్వీట్

image

పోలవరం స్పిల్‌వే, కాఫర్ డ్యాంలు పూర్తిచేయకుండానే డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించడం వల్లే నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక స్పష్టం చేసిందని, చంద్రబాబు తప్పిదం వల్లే ఇలా జరిగిందని ‘ఎక్స్’ వేదికగా వైసీపీ ట్వీట్ చేసింది. 2022లో అసెంబ్లీలో వైఎస్ జగన్ ఇదే విషయాన్ని చెప్పారని, అప్పట్లో టీడీపీ నేతలు ఈ వాస్తవాన్ని అంగీకరించలేదని ఆ పార్టీ తాజా ట్వీట్‌లో గుర్తు చేసింది.

News March 7, 2026

పెద్దపల్లి: గ్రామ పంచాయతీలకు ₹21.04 కోట్ల నిధులు

image

PDPL జిల్లాలోని 13 మండలాల పరిధిలోని జీపీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ₹21.04 కోట్లు విడుదలైనట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. 2023-25 ఆర్థిక సంవత్సరాలకు గాను 3 విడతల్లో ఈ నిధులను కేటాయించామన్నారు. ఇందులో అన్‌టైడ్‌ గ్రాంట్‌ కింద ₹5.73 కోట్లు, టైడ్‌ గ్రాంట్‌ కింద ₹15.31 కోట్లు విడుదలయ్యాయని వివరించారు. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.