News December 1, 2025

వరంగల్‌లో నైపుణ్యాభివృద్ధిపై ఎంపీ కావ్య ప్రశ్న

image

బలహీన వర్గాల అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టాలని ఎంపీ కడియం కావ్య పార్లమెంట్‌లో కేంద్రాన్ని కోరారు. వరంగల్‌లో నైపుణ్యాభివృద్ధి పథకాల అమలు, లోపాలపై ఆమె పార్లమెంట్‌లో ప్రశ్నించారు. పీఎంకేవీవై ప్రారంభం నుంచి ఎనిమిది శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుతం అమలులో ఉన్న 4.0లో ఒక్క కేంద్రం కూడా పనిచేయకపోవడంపై ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News March 21, 2026

ఈనెల 23న ₹1.35లక్షల కోట్ల ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన

image

AP: రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడనుంది. ప్రతిష్ఠాత్మక ఆర్సెలార్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ఈనెల 23న శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో ₹1,35,964 కోట్లతో ఇది ఏర్పాటు కానుంది. ఏటా 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తే లక్ష్యంగా 5,465 ఎకరాల్లో రెండు ఫేజుల కింద దీనిని నిర్మిస్తున్నారు.

News March 21, 2026

జాగ్రత్త.. రేపు పిడుగులతో వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, ఉ.గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. ప్రజలు చెట్ల కింద నిలబడొద్దని సూచించింది. TGలోని పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

News March 21, 2026

827 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

image

సశస్త్ర సీమా బల్(SSB)లో 827 కానిస్టేబుల్(నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి నేటి నుంచి అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. డ్రైవర్, వెటర్నరీ, టైలర్, బార్బర్, వెయిటర్, కార్పెంటర్ తదితర ఉద్యోగాలున్నాయి. టెన్త్ పాస్, సంబంధిత విభాగంలో ITI, డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, వయసు 18-27 ఏళ్లు ఉండాలి. PET/PST, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ APR 21.
సైట్: https://ssb.gov.in/