News December 1, 2025
సిద్దిపేట: AIDS గురించి పిల్లలకు తెలియజేయాలి: జడ్జి

HIV/AIDS గురించి తల్లి దండ్రులు పిల్లలకు తెలియజేయాలని సిద్దిపేట జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ, జడ్జి సంతోష్ కుమార్ సూచించారు. ఎయిడ్స్ ప్రివెన్షన్ డే సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో ఈ వ్యాధి గురించి ఎవరికి తెలిసేది కాదన్నారు. ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలాన్నారు.
Similar News
News March 6, 2026
VZM: అందొచ్చిన కొడుకు అకాలమరణం

విజయనగరం జిల్లాలో తెల్లవారుజామున జరిగిన <<19308463>>రోడ్డు ప్రమాదం<<>>లో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు దత్తిరాజేరు (M) పెదమానాపురం గ్రామానికి చెందిన రౌతు నానిగా గుర్తించారు. నాని, రౌతు సాయి, గెద్ద శేఖర్, సాయి స్నేహితుడు ప్రయాణిస్తున్న కారు గజపతినగరం (M) మరుపల్లి వద్ద అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. అందొచ్చిన కొడుకు అకాలమరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
News March 6, 2026
నల్గొండలో భానుడి ప్రతాపం

నల్గొండ జిల్లాలో మార్చి మొదటి వారంలోనే ఎండలు ముదురుతున్నాయి. గత నెల 15 నుంచి క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారం గరిష్ఠంగా 36.5 డిగ్రీలకు చేరాయి. మధ్యాహ్నం వేళ భానుడి సెగలకు జనం అల్లాడిపోతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
News March 6, 2026
న్యూజిలాండ్‌తో అంత ఈజీ కాదు!

ఆదివారం T20 WC ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ ఢీకొంటాయి. WC చరిత్రలో హెడ్ టు హెడ్ చూస్తే కివీస్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇరు జట్లు తలపడ్డ 3 మ్యాచుల్లో ఆ జట్టే గెలిచింది. ప్రస్తుత టీమ్‌లో ఫిన్ అలెన్, సీఫర్ట్ భయంకరమైన ఫామ్‌లో ఉన్నారు. రచిన్, ఫిలిప్, చాప్‌మన్, మిచెల్‌తో కూడిన కివీస్ బ్యాటింగ్ లైనప్ శత్రుదుర్భేద్యంగా ఉంది. వీరికి బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగం ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.


