News December 1, 2025
‘ఆర్‌జీ-3 ఏరియాలో నవంబర్‌లో 72% బొగ్గు ఉత్పత్తి’

RG-3 ఏరియాలో NOV నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలు GM నరేంద్ర సుధాకరరావు వెల్లడించారు. 5.70 లక్షల టన్నుల లక్ష్యానికి 4.09 లక్షల టన్నులు (72%) ఉత్పత్తిచేశారు. ఓబీ వెలికితీతలో షవెల్స్ విభాగం 12.50 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 13.11 లక్షల క్యూబిక్ మీటర్లు (105%) సాధించింది. బొగ్గు రవాణా 5.18 లక్షల టన్నులు నమోదైంది. OCP-1 38%, OCP-2 116% ఉత్పత్తి సాధించాయి. లక్ష్య సాధనకు భద్రతతో పని చేయాలన్నారు.
Similar News
News March 7, 2026
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రసక్తే లేదు: ప్రభుత్వ వర్గాలు

దేశంలో ఇంధన నిల్వలు మెరుగుపడుతున్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేందుకు ఇతర మార్గాల ద్వారా క్రూడాయిల్ ఇంపోర్ట్స్‌ను 60% నుంచి 70%కి పెంచినట్లు తెలిపాయి. అలాగే ముప్పులేని పొరుగు దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ హామీ ఇవ్వడంతో హార్ముజ్ మార్గంలో రవాణా త్వరలోనే సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి.
News March 7, 2026
మంచిర్యాల: ఈపీ ఫిట్టర్ ట్రైనీల భర్తీకి దరఖాస్తులు

సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో ఈపీ ఫిట్టర్ ట్రైనీల ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. లాంగ్ వాల్ సెక్షన్లు, నిరంతర మైనర్‌లో పనిచేస్తున్న ఫిట్టర్లు మినహా అండర్ గ్రౌండ్ గనులలో పదేళ్ల అనుభవం, ఐటీఐలో ఫిట్టర్‌గా ఎన్సీవీటీతో అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత ఏరియా జీఎమ్‌లకు సమర్పించాలని సూచించారు.
News March 7, 2026
ఉమ్మడి కృష్ణాలో MROల కొరత.. రెవెన్యూలో అవినీతిమయం..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 25 మండలాల్లో రెగ్యులర్ MROలు లేకపోవడంతో పాలన అస్తవ్యస్తమైంది. బంటుమిల్లి, జగ్గయ్యపేట, మైలవరం వంటి కీలక ప్రాంతాల్లో డిప్యూటీ MROలే ఇన్‌ఛార్జ్‌లుగా కొనసాగుతున్నారు. ఇదే అదునుగా క్షేత్రస్థాయిలో VROలు, RIలు ఫ్యామిలీ సర్టిఫికెట్లు, పాస్‌బుక్కుల కోసం సామాన్యుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


