News December 1, 2025

అర్జీల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్

image

పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు చేపడతామని కలెక్టర్ మహేశ్ కుమార్ హెచ్చరించారు. సోమవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన పీజీఆర్ఎస్‌ను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, మొత్తం 135 అర్జీలను స్వీకరించారు.

Similar News

News March 13, 2026

NGKL: 60 కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు

image

పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జిల్లా విద్యాధికారి రమేశ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 265 పాఠశాలల విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు.

News March 13, 2026

పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు: ఎస్పీ

image

మెదక్ జిల్లాలో పదో తరగతి పరీక్షల కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జిల్లాలోని అన్ని కేంద్రాల వద్ద 163 BNSS అమలులో ఉంటుందని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.

News March 13, 2026

చెరువుల పరిరక్షణే లక్ష్యం: HNK కలెక్టర్

image

జిల్లాలోని చెరువులు, కుంటలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని HNK కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. జల వనరుల్లో సిల్ట్ పేరుకుపోవడం, కాలుష్య కారకాలు చేరడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చెరువుల నీటి నాణ్యతను కాపాడుతూ, జీవవైవిధ్యానికి భంగం కలగకుండా పక్కా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.