News December 1, 2025

రామగుండం కమిషనరీట్‌లో నిషేధాజ్ఞలు కొనసాగింపు

image

RGM పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అనుమతిలేని డ్రోన్‌లు, DJ సౌండ్లపై నిషేధాన్ని JAN 1, 2026 వరకు పొడిగించినట్లు CP అంబర్ కిషోర్ ఝా ప్రకటించారు. మహిళల భద్రత, శాంతిభద్రతల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే BNS 223, 1348 ఫసలీ చట్టాల ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ర్యాలీలు, ధర్నాలు వంటి ప్రజాసమావేశాలకు ముందస్తు అనుమతి తప్పనిసరని తెలిపారు.

Similar News

News April 3, 2026

ఇకపై వారు 4 పెళ్లిళ్లు చేసుకోలేరు: అమిత్ షా

image

త్వరలోనే యూనిఫామ్ సివిల్ కోడ్(UCC)ను అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఇకపై చొరబాటుదారులు నాలుగేసి పెళ్లిళ్లు చేసుకోలేరన్నారు. అస్సాంలో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలు UCC పరిధిలోకి రావని స్పష్టం చేశారు. మేఘాలయలో చొరబాటుదారులు గిరిజన మహిళలను వివాహం చేసుకొని గారో హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌లో బలపడటానికి ప్రయత్నించారన్నారు. దీనివల్ల ఉద్రిక్తతలు తలెత్తాయని చెప్పారు.

News April 3, 2026

చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ: మంత్రి సురేఖ

image

నగరంలో చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు రాష్ట్ర దేవదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా వరంగల్ (తూర్పు)నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించారు.

News April 3, 2026

​సింహాచలంలో ‘ఉంగరాల వేట’ వినోదం

image

​సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా నేడు అత్యంత ఆసక్తికరమైన ‘అంగుళీయక అన్వేషణ’ ఉత్సవం జరిగింది. భక్తికి వినోదాన్ని జోడించి స్వామివారి లీలలను కళ్లకు కట్టేలా నిర్వహించారు. కళ్యాణ సమయంలో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బంగారు ఉంగరం కనిపించకుండా పోయిందనే నెపంతో ఈ సరదా ఉత్సవాన్ని నిర్వహించడం ఇక్కడి అనాదిగా వస్తున్న ఆచారం.