News December 1, 2025
పెద్దపల్లి: 35 కంప్యూటర్ల సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు 35 కంప్యూటర్ల సరఫరా కోసం ఆసక్తి గల సరఫరాదారులు డిసెంబర్ 4లోగా దరఖాస్తులు సమర్పించాలని ఇన్చార్జ్ డీఈఓ శారద తెలిపారు. దరఖాస్తులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో స్వీకరించబడతాయి. వివరాలకు సెక్టోరల్ అధికారి సి.హెచ్. మల్లేష్ గౌడ్ (ఫోన్: 9959262737) ను సంప్రదించవచ్చు.
Similar News
News March 16, 2026
నేటి నుంచి పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

జాతీయ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నేటి నుంచి ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుందని పశుసంవర్థక శాఖ జేడీ ప్రేమ్‌చంద్ తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పశువులకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాకు 3.20 లక్షల మందు డోసులు సరఫరా అయ్యాయని, ప్రతి గ్రామంలోని పశువులకు ముందస్తుగా టీకాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News March 16, 2026
నక్సలైట్ రోల్‌లో పీపుల్స్ స్టార్

స్వీయ దర్శకనిర్మాణంలోనే సినిమాలు చేస్తున్న పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి చాలా ఏళ్ల తర్వాత ఓ బయటి చిత్రంలో నటిస్తున్నారు. శ్రీ హర్ష తెరకెక్కిస్తున్న హుషారు-2లో నక్సలైట్ పాత్ర పోషిస్తున్నారు. తన ఐడియాలజీకి దగ్గరగా ఉండటంతోనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో టెంపర్ సహా అనేక చిత్రాల కోసం డైరెక్టర్లు సంప్రదించినా ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇకపై ఆయన ఇతరుల సినిమాల్లో నటిస్తారో లేదో వేచి చూడాలి.
News March 16, 2026
ఖమ్మం: బడ్జెట్ సమావేశాలు.. నిధుల మోక్షం కలిగేనా?

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, 20న డిప్యూటీ సీఎం భట్టి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు క్యాబినెట్‌లో కీలకం కావడంతో..సీతారామ, పాలేరు జేఎన్‌టీయూ, ఇందిరమ్మ ఇళ్లు, పర్యాటక కారిడార్‌కు నిధులు వస్తాయని ఎదురుచూస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణకు ఈ బడ్జెట్ ఎంతవరకు ఊతమిస్తుందో వేచి చూడాలి.


