News December 1, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని మౌలిక సదుపాయాలు, భద్రత, సభాస్థలి, రవాణా నిర్వహణ వంటి అంశాలను అధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు. రేపు జరగనున్న ప్రారంభోత్సవం సందర్భంగా ఎలాంటి లోపాలు లేకుండా పనిచేయాలని అధికారులకు సూచనలు చేశారు.
Similar News
News December 3, 2025
49 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్& ఎంపవర్‌మెంట్‌లో 49 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. NIRF ర్యాంక్ పొందిన టాప్ 100 ఇన్‌స్టిట్యూట్‌లో డిగ్రీ 60% మార్కులతో ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://socialjustice.gov.in
News December 3, 2025
కోటి మంది ఫాలోవర్లను కోల్పోయాడు

స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో X(ట్విటర్)లో 10 మిలియన్ల(కోటి) ఫాలోవర్లను కోల్పోవడం నెట్టింట చర్చనీయాంశమైంది. నవంబర్‌లో 115M ఫాలోవర్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 105Mకు చేరింది. దీనికి ప్రధాన కారణం ఫేక్ అకౌంట్ల తొలగింపేనని తెలుస్తోంది. అటు NOV 18న ట్రంప్‌తో రొనాల్డో భేటీ ప్రభావం చూపించి ఉండొచ్చని సమాచారం. ట్రంప్ అంటే నచ్చని వారికి వారి మీటింగ్ కోపం తెప్పించిందని తెలుస్తోంది.
News December 3, 2025
KNR: CM మీటింగ్‌కు 144 RTC బస్సులు.. తిప్పలు..!

హుస్నాబాద్‌లో తలపెట్టిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు కరీంనగర్ రీజియన్ పరిధిలో ఐదు డిపోల నుంచి 144 ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. వీటిల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రజలను తరలించనున్నారు. ఇదిలాఉండగా నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికోసం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్న అరకొర బస్సులను సీఎం మీటింగ్‌కు అలాట్ చేయడంతో ప్రజలకు తిప్పలు తప్పేలాలేవు.


