News December 1, 2025

కాంగ్రెస్‌కు శశిథరూర్ దూరం అవుతున్నారా?

image

కాంగ్రెస్‌కు ఆ పార్టీ MP శశిథరూర్‌కు మధ్య విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. ఇటీవల SIRపై పార్టీ నిర్వహించిన భేటీకి ఆయన గైర్హాజరయ్యారు. అనారోగ్యం వల్లే వెళ్లలేదని చెప్పారు. కానీ తర్వాతి రోజే PM పాల్గొన్న ఓ ప్రోగ్రామ్‌‌కు వెళ్లారు. తాజాగా పార్లమెంట్ సెషన్స్ ముందు జరిగిన పార్టీ మీటింగ్‌కూ హాజరుకాలేదు. ట్రావెలింగ్‌లో ఉన్నందునే తాను రాలేదని ఆయన చెబుతున్నప్పటికీ INCకి దూరమవుతున్నారనే చర్చ జరుగుతోంది.

Similar News

News March 10, 2026

వేసవిలో వ్యాయామం.. ఏ టైమ్‌లో మంచిది!

image

సమ్మర్‌లో 8am లోపు, 6pm తర్వాత వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘చెట్లు ఎక్కువగా ఉండే పార్కుల్లో అయితే మంచిది. తేలికపాటి, లేతరంగు దుస్తులు, టోపీ ధరించాలి. గంట వ్యాయామం చేసేవాళ్లు 45ని. చేస్తే సరిపోతుంది. డీహైడ్రేషన్‌కు గురికాకుండా మధ్యమధ్యలో తగినన్ని నీళ్లు తాగాలి. అధిక చెమట, బలహీనత, తల తిరగడం, వికారంతోపాటు తలనొప్పి తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే వ్యాయామం నిలిపేయాలి’ అని చెబుతున్నారు.

News March 10, 2026

ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఆరు నుంచి 12 వారాల్లో బిడ్డ అవయవాలన్నీ ఏర్పడుతాయి. ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్‌రేలకు దూరంగా ఉండాలి. ఏ సమస్య అనిపించినా వైద్యులను సంప్రదించాలి. జ్వరం వస్తే వెంటనే చికిత్స చేయించుకోవాలి. జన్యుపరమైన సమస్యలుంటే తప్ప అబార్షన్‌ కాదు. అన్ని పనులు చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, పరిగెత్తడం మానేయాలని సూచిస్తున్నారు.

News March 10, 2026

భారత్ నుంచి బంగ్లాకు 5,000 టన్నుల డీజిల్?

image

ఇండియా నుంచి తమకు పైప్‌లైన్ ద్వారా 5,000 టన్నుల డీజిల్ రానుందని బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ రెజనూర్ రెహ్మాన్ తెలిపారు. ఏటా 1,80,000 టన్నుల డీజిల్ సరఫరా కోసం భారత్‌తో ఒప్పందం ఉందని.. తాజా దిగుమతి అందులో భాగమేనన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో బంగ్లా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది.