News December 1, 2025

అయిజ: “Way2News ఎఫెక్ట్” ఎట్టకేలకు నామినేషన్ దాఖలు

image

అయిజ మండలం ఉత్తనూర్ సర్పంచ్ స్థానానికి హాలియా దాసరి జయమ్మ నామినేషన్ వేసే ప్రయత్నం చేయగా అదే సామాజిక వర్గానికి చెందిన వారు బెదిరింపులకు గురి చేశారు. ఈ విషయమై Way2News లో సోమవారం ఉదయం “ఉత్తనూరులో హాలియా దాసర్లకు బెదిరింపులు” శీర్షికన కథనం ప్రచురితమైంది. కథనానికి మండల అధికారులు స్పందించి గ్రామానికి చేరుకున్నారు. వారిని కలిసి సాయంత్రం నామినేషన్ వేయించారు. వే2న్యూస్‌కు గ్రామస్థులు అభినందించారు.

Similar News

News March 18, 2026

JN: వల్మీడి బ్రహ్మోత్సవాలు.. సమన్వయంగా పనిచేయాలి: కలెక్టర్

image

పాలకుర్తి మండలం వల్మిడిలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం సమీక్ష నిర్వహించారు. డీసీపీ, వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టరేట్‌లో చర్చించారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

News March 18, 2026

జనగామ: పది పరీక్షలకు 99.95 శాతం హాజరు

image

జనగామ జిల్లాలోని 39 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పదో తరగతి హిందీ పరీక్షకు 99.95 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. మొత్తం 6430 మంది విద్యార్థులకు గాను 6427 మంది హాజరయ్యారని, ముగ్గురు గైర్హాజరయ్యారని తెలిపారు. రెండో రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ తెలిపారు.

News March 18, 2026

BHPL: డిప్యూటీ తహశీల్దార్‌లకు పదోన్నతులు

image

రెవెన్యూ శాఖలో పదోన్నతులు కల్పిస్తూ సీసీఎల్ఏ అధికారి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లాకు నలుగురు తహశీల్దార్లు నియమితులయ్యారు. ములుగు నుంచి రాపల్లి రాజేశ్వరరావు, కరీంనగర్ నుంచి టి.వసంత్ రావు, టి.స్వరూప రాణి, వరంగల్ నుంచి అడ్లూరి రాజేశ్వర్ రావులకు భూపాలపల్లి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. త్వరలోనే వీరు విధుల్లో చేరనున్నారు.