News December 1, 2025
నిపుణులతో తరగతుల నిర్వహణ: దీపక్ తివారి

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు నిపుణుల ద్వారా తరగతులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ జిల్లా విద్యాధికారి దీపక్ తివారి సూచించారు. సోమవారం ASF జిల్లా కలెక్టరేట్‌లో పీఎం శ్రీ పాఠశాలల హెచ్ఎమ్‌లతో సమీక్ష నిర్వహించారు. పీఎం శ్రీ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News March 25, 2026
నర్సాపూర్: స్వయంభూగా కొలువైన సీతారామసమేత ఆలయం

స్వయంభు ఏకాంతంగా వెలిసిన సీతారామ స్వామి ఆలయంగా పేరు పొందుతున్న నర్సాపూర్ పట్టణ సమీపంలోని సీతారాంపూర్లో ప్రతిఏటా శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పూజారి హరిప్రసాద్ శర్మ తెలిపారు. 600 ఏళ్ల క్రితం కాకతీయులు ఆలయం నిర్మించినట్లు తెలిపారు. శ్రీ సీతారామసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజులపాటు ఉత్సవాల గురించి ఆయన వే2న్యూస్‌తో తెలిపారు. ఉదయగిరి చుట్టూ బండ్ల ప్రదక్షిణలు నిర్వహిస్తారన్నారు.
News March 25, 2026
జగిత్యాల జిల్లా ముఖచిత్రం మారనుందా..?

జిల్లాలో ప్రస్తుతం JGTL, ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగా కొండగట్టు, మెట్‌పల్లి, రాయికల్ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయనే చర్చ జోరుగా సాగుతోంది.
మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి.
రాయికల్, సారంగాపూర్, బీర్పూర్, బుగ్గారం.
కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి, భీమారం.
జగిత్యాల, JGTL రూరల్.
మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి, గొల్లపల్లి మండలాలతో కొండగట్టు నియోజకవర్గం ఏర్పడుతుందనే చర్చ SMలో నడుస్తోంది.
News March 25, 2026
అమెరికా-ఇరాన్ మధ్య పాక్.. వ్యూహమా? స్వార్థమా?

US, ఇరాన్ మధ్య గొడవను ఆపేందుకు పాక్ ఇప్పుడు మధ్యవర్తిగా మారుతోంది. దీని వెనుక శాంతి కంటే స్వార్థమే ఎక్కువ కనిపిస్తోందని అనలిస్టులు అంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాలేక గల్ఫ్ దేశాల సపోర్ట్ కోసం ఇలా చేస్తోందని విశ్లేషిస్తున్నారు. అలాగే ఇండియా ఇన్‌ఫ్లుయెన్స్‌ను తగ్గించాలనే వ్యూహమూ కనిపిస్తోందంటున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ డైరెక్షన్‌లో జరుగుతున్న ఈ టాక్టిక్స్‌కు ఇరాన్ ఇంకా ఓకే చెప్పలేదు.


