News December 1, 2025
పాతబస్తీ మెట్రోకు రూ.125 కోట్లు మంజూరు

పాతబస్తీ మెట్రోకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధులకు అనుమతులు వచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు. పాతబస్తీ మెట్రోను మరింత వేగంగా నిర్మించడం కోసం ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.
Similar News
News March 7, 2026
కామారెడ్డి: ఇచ్చిన మాట నెరవేర్చడం ప్రభుత్వం లక్ష్యం: షబ్బీర్ అలీ

ఇచ్చిన మాట నెరవేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు. శనివారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన చిట్యాల రాజమణికి సంబంధించిన ఇందిరమ్మ ఇంటిని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శనివారం ప్రారంభించారు. నూతన వస్త్రాలతో పాటు నిత్యావసర సరకులను అందజేశారు. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం ఇచ్చిన హామీ మేరకు ఇంటి నిర్మాణం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
News March 7, 2026
నేత్రపర్వంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శనివారం శ్రీ సీతారాముల నిత్య కళ్యాణ వేడుక నేత్రపర్వంగా జరిగింది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించి పరవశించిపోయారు. అనంతరం శ్రీ సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులు అందుకున్నారు.
News March 7, 2026
ఖమ్మంలో న్యాయవాదులకు 40 గంటల మీడియేషన్ శిక్షణ

ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో శనివారం న్యాయవాదులకు 40 గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద, జస్టిస్ కె.శరత్ ప్రారంభించారు. కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం కీలకమని వారు పేర్కొన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో స్నేహపూర్వకంగా వివాదాలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రాజగోపాల్ తదితరులున్నారు.


