News December 1, 2025

₹50వేల కోట్ల దావా.. AERA పక్షాన కేంద్రం!

image

ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల ప్రైవేట్ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA) ఆఫ్ ఇండియా మధ్య ₹50వేల కోట్ల దావా SCకు చేరింది. ఇందులో కేంద్రం AERA పక్షాన నిలిచింది. రెగ్యులేటెడ్ సర్వీసెస్ కోసం కాలిక్యులేట్ చేసే అసెట్స్ క్యాపిటల్ వ్యాల్యూపై విభేదాలున్నాయి. ఆపరేటర్లు గెలిస్తే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో యూజర్ డెవలప్మెంట్ ఫీజు ₹129 నుంచి ₹1261కి, ముంబైలో ₹175 నుంచి ₹3,856కు పెరుగుతుంది.

Similar News

News March 14, 2026

OTD: క్రికెట్ చరిత్రలో మర్చిపోలేని రోజు

image

ఇండియన్ క్రికెట్ చరిత్రలో అద్భుతం జరిగి నేటికి సరిగ్గా 25 ఏళ్లు. 2001 కోల్‌కతా టెస్టులో టీమ్ ఇండియా ఫాలో-ఆన్ ఆడుతూనే ఆస్ట్రేలియాను ఓడించి రికార్డు సృష్టించింది. VVS లక్ష్మణ్ (281), రాహుల్ ద్రవిడ్ (180) నాలుగో రోజంతా వికెట్ పడకుండా పోరాడి భారత్‌కు 171 పరుగుల చరిత్రాత్మక విజయాన్ని అందించారు. దీంతో టెస్టుల్లో వరుసగా 16 విజయాలతో దూకుడు మీదున్న ఆసీస్‌కు బ్రేక్ వేశారు.

News March 14, 2026

10 బాలిస్టిక్ మిస్సైల్స్‌ను ప్రయోగించిన నార్త్ కొరియా

image

నార్త్ కొరియా దాదాపు 10 బాలిస్టిక్ మిస్సైల్స్‌ను జపాన్ సముద్రం వైపు ప్రయోగించినట్లు సౌత్ కొరియా వెల్లడించింది. వీటి కెపాసిటీ, రేంజ్‌ను గుర్తించడం సాధ్యం కాలేదని తెలిపింది. జాయింట్ మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్న అమెరికా-సౌత్ కొరియాకు హెచ్చరికగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అణ్వాయుధ సామర్థ్యమున్న నార్త్ కొరియా మిస్సైల్స్ ప్రయోగం కలకలం రేపుతోంది.

News March 14, 2026

రఘు భాయ్.. ది రియల్ హీరో

image

టీమ్ఇండియా టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత నెట్టింట ఒకరి పేరు మారుమోగుతోంది. ఆయనే రాఘవేంద్ర (రఘు భాయ్). ఒకప్పుడు కేవలం ₹21తో ఇంటి నుంచి బయటకొచ్చి క్రికెట్ కోసం పోరాడిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. నెట్స్‌లో గంటకు 150 కి.మీ వేగంతో బంతులు విసిరి, మన బ్యాటర్లను ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకం. అందుకే విరాట్ కోహ్లీ వంటి స్టార్లే ఆయనను టీమ్‌ఇండియాకు నిజమైన హీరోగా అభివర్ణిస్తున్నారు.