News December 1, 2025
మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థులు సత్కరించిన కలెక్టర్

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న నిర్వహించిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ భీమవరం కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాక్ అసెంబ్లీలో ప్రతిభ చూపిన విద్యార్థులు భవిష్యత్తులో నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
Similar News
News March 28, 2026
తీర ప్రాంతాల ప్రజలకు సౌకర్యవతంగా వంతెనలు

10 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న <<19499031>>వంతెనల <<>>అప్రోచ్‌లకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మోక్షం కల్పించింది. తీర ప్రాంత గ్రామాలను కలుపుతూ ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఈ వంతెనలు ఉంటాయి. అప్రోచ్‌ల నిర్మాణంలో వంతెల వద్ద ఉన్న ఆలయాలకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు జరిగేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వంతెనల వినియోగంలోకి వస్తే భీమవరం పట్టణంలో ట్రాఫీక్ సమస్య కూడా తగ్గుతుంది. పలు రకాల ఉత్పత్తుల రవాణా సులభంగా సాగుతుంది.
News March 28, 2026
ఎట్టకేలకు భీమవరం వంతెనలకు మోక్షం

భీమవరం, యనమదుర్రు డ్రైన్ వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న చేపల మార్కెట్, గొల్లవానితిప్ప, తోకతిప్ప బ్రిడ్జిలు అందుబాటులోకి రానున్నాయి. వైసీపీ హయాంలో వంతెనలు కట్టినా రోడ్లు వేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు పనులు పట్టాలెక్కడంతో పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
News March 28, 2026
ఆకివీడు ఆలయం వద్ద కంచె.. మోహరించిన బలగాలు

ఆకివీడు పెదపేటలోని శిథిలావస్థకు చేరిన ఆలయం వద్ద శ్రీరామనవమి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా, భక్తులు లేదా ఇతర వ్యక్తులు ఎవరూ ఆలయం లోపలికి వెళ్లకుండా అధికారులు ఆలయం చుట్టూ ఇనుప కంచె (ఫెన్సింగ్) ఏర్పాటు చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఈ ప్రాంతంలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. భారీగా పోలీసు బలగాలు మోహరించి పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు.


