News December 1, 2025
వనపర్తి జిల్లాలో నేటి నుంచి 30 పోలీస్ యాక్ట్ అమలు

వనపర్తి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 1-31 వరకు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఈ యాక్ట్ ప్రకారం పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు నిరసనలు ర్యాలీలు పబ్లిక్ మీటింగులు సభలు సమావేశాలు నిర్వహించరాదన్నారు. ఈ విషయంలో ప్రజలు రాజకీయ నాయకులు సహకరించాలన్నారు.
Similar News
News March 22, 2026
అర్ధరాత్రి ఆపి మరీ ముఖం కడిగిస్తున్నారు..!

నిద్రమత్తు వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లా SP రాహుల్ మీనా ఆదేశాలతో పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ‘స్టాప్ వాష్ అండ్ గో’ పేరుతో అర్ధరాత్రి, తెల్లవారుజామున జాతీయ రహదారులపై వాహనాలను నిలిపి డ్రైవర్లతో ముఖం కడిగిస్తున్నారు. లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను నిద్రమత్తు నుంచి అప్రమత్తం చేస్తూ పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. దీంతో ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
News March 22, 2026
KMR: రాష్ట్రంలో 198 ఉద్యోగాలు.. రేపే హాల్‌టికెట్లు

TGSRTCలో 198 సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు హాల్‌టికెట్లను సోమవారం ఉ.8 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. https://www.tgprb.in/లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఉద్యోగాలకు దాదాపు 26 వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ నెల 29న 10AM-1PM వరకు ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు, 2.30PM-5.30PM వరకు మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
News March 22, 2026
ఈ IPL సీజన్ గిల్‌కు మంచి అవకాశం: పుజారా

IPL-2026లో శుభ్‌మన్ గిల్ చెలరేగి ఆడితే భారత T20 జట్టులో తిరిగి స్థానం పొందే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ పుజారా అభిప్రాయపడ్డారు. ‘గిల్ క్వాలిటీ ప్లేయర్. T20 WC జట్టులో చోటు దక్కకపోవడం అతడిలో కసిని పెంచి ఉంటుంది. ఈ IPL సీజన్ మంచి అవకాశం. 150-160SRతో బ్యాటింగ్ చేయగలనని నిరూపించుకోవాలి. ఈ టైమ్‌లో అతడిపై ఒత్తిడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. IPLలో గుజరాత్ టైటాన్స్‌కు గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.


