News December 1, 2025
నస్పూర్: ‘ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి’

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారులకు అవసరమైన శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలు, బ్యాలెట్ పేపర్ల నిర్వహణ, పోలింగ్ రోజున ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచించారు.
Similar News
News March 27, 2026
సంగారెడ్డి: టెండర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డిలోని స్విమ్మింగ్ పూల్ వద్ద మూడు నెలల పాటు కేపిటోరియా, స్పోర్ట్స్ మెటీరియల్ అమ్ముకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు. స్విమ్మింగ్ పూల్ వద్ద అద్దె రూ.25 వేలుగా నిర్ణయించినట్లు చెప్పారు. ఆసక్తి గలవారు ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 7981798957 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
News March 27, 2026
మాజీ ఎమ్మెల్సీలకు రాజకీయ “పరీక్ష” కాలం..!

తనను గుర్తించడం లేదని ఒకరు, కుటుంబ కలహాలతో మరొకరు సొంత పార్టీలను కాదని మాజీ ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, కవితలు రాజీనామా చేశారు. అయితే, సొంత పార్టీ పెట్టి తన సత్తా చాటాలని కవిత ప్రయత్నిస్తుంది. ఇక జీవన్ రెడ్డి మాత్రం తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి సింపతితో BRSలో చేరి కాంగ్రెస్‌పై తన రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మాజీ ఎమ్మెల్సీలకు రాజకీయ పరీక్ష కాలంగా చెప్పుకోవచ్చు.
News March 27, 2026
ఇస్గాం పోలీస్ స్టేషన్‌లో ఎక్స్‌టార్షన్ కేసులు నమోదు: ఎస్పీ

కాగజ్ నగర్ మండలం ఇస్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని అందేవల్లి గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురిపై ఎక్స్‌టార్షన్ కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. అందేవేల్లి గ్రామంలో ఒక్కరు, రాసపల్లి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించామన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.


