News December 1, 2025
శ్రీపతిపల్లి: సర్పంచ్ బరిలో సొంత అన్నదమ్ములు

‘తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే’ అన్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత అన్నదమ్ములు ప్రధాన రాజకీయ పార్టీల సర్పంచ్ అభ్యర్థులుగా ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. చిల్పూర్(M) శ్రీపతిపల్లికి చెందిన రంగు రమేష్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా, ఆయన సోదరుడు రంగు హరీష్ BRS బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఒకే కుటుంబం నుంచి పోటీలో నిలవడంతో విజయం ఎవరిని వరిస్తుందోనని గ్రామంలో తీవ్ర చర్చ నడుస్తోంది.
Similar News
News April 3, 2026
ఐరన్ టాబ్లెట్లు ఎప్పుడు తీసుకోవాలంటే

ఐరన్ లోపించినప్పుడు, శరీరం అవసరం మేరకు ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేదు. దీనివల్ల కణజాలాలకు, అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందదు. దీనికోసం ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. వీటిని పరగడపున తీసుకుంటే చక్కగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఐరన్‌తో పాటు వేరే మందులు తీసుకోవద్దు. ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న గంట వరకూ డెయిరీ ప్రోడక్ట్స్ అయిన పాలు, పెరుగు వంటివి తీసుకోకూడదని చెబుతున్నారు.
News April 3, 2026
వివాదాల్లో ఖమ్మం మంత్రులు.. కేడర్ గుస్సా!

ఉమ్మడి ఖమ్మంలో మంత్రుల తీరు, నామినేటెడ్ పదవుల జాప్యం కాంగ్రెస్ శ్రేణుల్లో అసహనం కలిగిస్తోంది. సింగరేణి బ్లాకుల వ్యవహారంలో భట్టి, వెలుగుమట్ల భూములు వ్యవహారంలో తుమ్మల, క్వారీ వివాదాల్లో పొంగులేటి ఆరోపణలు ఎదుర్కోవడం విపక్షాలకు అస్త్రాలుగా మారాయి. మరోవైపు ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా నామినేటేడ్ పదవులు దక్కకపోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర నిరాశలో ఉన్నట్లు చర్చ నడుస్తోంది.
News April 3, 2026
పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన

అనంతపురం జిల్లాలోని గ్రామ పంచాయతీలలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. మొత్తం 575 పంచాయతీలు ఉండగా, గతంలోనే ఎన్నికలు జరగని ఏ.నారాయణపురం, పామిడిలకు పాత అధికారులే కొనసాగుతారని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రత్యేక అధికారుల జాబితాకు ఆయన ఆమోదముద్ర వేశారు. మండలాల్లో ఒక్కో అధికారికి రెండు నుంచి ఆరు పంచాయతీల బాధ్యతలను అప్పగించినట్లు కలెక్టర్ వెల్లడించారు.


