News December 1, 2025

గుమ్మలక్ష్మీపురం: చలికి వణకుతూ.. వానకు తడుస్తూ విద్యా పయనం

image

గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు పంచాయతీ గాండ్ర గ్రామంలో 5వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులు సుమారు 18 మంది ఉన్నారు.అయితే గ్రామంలో పాఠశాల లేకపోవడంతో తమ పిల్లలు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాదుపురం కాలినడకన వెళ్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. శీతాకాలంలో చల్లని గాలులకు,వర్షాకాలంలో వానలకు పిల్లలు ఇబ్బందులు పడుతూ పాఠశాలకు వెళ్తున్నారని,అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Similar News

News March 11, 2026

జిల్లా అభివృద్ధిపై సీఎం సమీక్షలో నెల్లూరు కలెక్టర్

image

అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్‌లో CM చంద్రబాబు నిర్వహించిన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొదటి రోజు సమావేశంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చేసే ప్రణాళికల పట్ల సమీక్షించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రదేశాలు వంటి సమాచారాన్ని చర్చించారు.

News March 11, 2026

ఏలూరు జిల్లాలో వంట గ్యాస్‌పై జేసీ ఏమన్నారంటే!

image

ఏలూరు జిల్లావ్యాప్తంగా గృహ అవసరాలకు, ప్రభుత్వ వసతి గృహాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ స్పష్టం చేశారు. కృత్రిమ కొరతపై వచ్చే వదంతులను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. బుకింగ్ లేదా సరఫరాలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

News March 11, 2026

MGU డిగ్రీ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

నల్గొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. సెమిస్టర్- 2, 4, 6 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్), సెమిస్టర్-1, 2, 3, 4, 5, 6 (బ్యాక్ లాగ్) పరీక్షలు ఏప్రిల్-7 నుంచి మే-2 మధ్య జరుగుతాయని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. R-16 & R-19 & R-25 బ్యాచ్ విద్యార్థులు గమనించాలని ఆయన తెలిపారు.