News December 1, 2025

చందుర్తి : ఎంపీడీవో కార్యాలయాలు, చెక్‌పోస్టుల తనిఖీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్‌కుమార్ సోమవారం పలు ఎంపీడీవో కార్యాలయాలు, ఎస్.ఎస్.టి. (స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్) చెక్ పోస్ట్ లను తనిఖీ చేశారు. ఆయన రుద్రంగి ఎంపీడీవో కార్యాలయం, చెక్‌పోస్టులను తనిఖీ చేసి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చందుర్తి, వేములవాడ అర్బన్, రూరల్ ఎంపీడీవో కార్యాలయాలను పరిశీలించి, సహాయ వ్యయ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు.

Similar News

News March 5, 2026

జగన్ పాపాలే వైసీపీకి శాపాలు: మంత్రి ఆనం

image

AP: మండలిలో కల్తీ నెయ్యిపై చెలరేగిన మంటలు చల్లారడం లేదు. YCP సభ్యుల ఆందోళనల మధ్యే తిరుమల లడ్డూపై మంత్రి ఆనం ప్రసంగించారు. ‘నివేదికలు కల్తీ జరిగాయని చెబుతుంటే YCP దుష్ప్రచారం చేస్తోంది. కల్తీ జరిగినట్లు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నారు కదా? జగన్ పాపాలే ఆ పార్టీకి శాపాలుగా మారాయి. గోవిందుడి తిరునామం కన్నెర్రజేసింది కాబట్టే 11 సీట్లు వచ్చాయి’ అని విమర్శించారు. సభ రేపటికి వాయిదా పడింది.

News March 5, 2026

కొత్తగూడెంలో 99 రోజులు యాక్షన్ ప్లాన్‌పై సమావేశం

image

కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై కార్పొరేటర్లతో కీలక సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన పాల్గొన్నారు. 99 రోజులపాటు కార్పొరేషన్ పరిధిలో నిర్వహించవలసిన అభివృద్ధి పనులు, డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాలు, డివిజన్ పరిధిలోని సమస్యలు పరిష్కారంపై కార్యచరణ రూపొందించారు. మేయర్ గణేష్, ఉప మేయర్ లలిత, కమిషనర్ సుజాత పాల్గొన్నారు.

News March 5, 2026

గద్వాల జిల్లాను టాప్‌లో నిలపండి: కలెక్టర్

image

విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి పునాది వంటిదని, ఈ ఏడాది ఫలితాల్లో గద్వాల జిల్లాను రాష్ట్రంలో టాప్-15 స్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. గురువారం గద్వాల ఐడీవోసీ నుంచి నిర్వహించిన జూమ్ అవగాహన సదస్సులో ఆయన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కీలక సూచనలు చేశారు. ఎండల దృష్ట్యా తగినంత నీరు తాగాలని, 6-8 గంటల నిద్ర తప్పనిసరన్నారు. సెల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలని సూచించారు.