News December 1, 2025

సిరిసిల్ల: ‘బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యం’

image

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి 27 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Similar News

News December 3, 2025

సంచార్‌ సాథీ యాప్‌తో స్నూపింగ్ సాధ్యం కాదు: కేంద్రం

image

సంచార్‌ సాథీ యాప్‌తో స్నూపింగ్ జరగలేదు, జరగబోదని లోక్‌సభలో కేంద్రమంత్రి సింధియా స్పష్టం చేశారు. భారత్‌లో అమ్మే ప్రతి ఫోన్‌లో ఆ యాప్ ప్రీ ఇన్‌స్టాల్ చేయాలని మొబైల్ తయారీ కంపెనీలకు సూచించారు. ఇప్పటికే అమ్మిన వాటిలో సాఫ్ట్‌వేర్ అప్డేట్ ద్వారా ఇన్‌స్టాల్ చేయాలన్నారు. మొదటిసారి ఫోన్ వాడేటప్పుడు కూడా డిజేబుల్, రెస్ట్రిక్ట్ చేసే ఆప్షన్స్ ఉండబోవని చెప్పారు. ప్రజల భద్రతే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు.

News December 3, 2025

దేవరకొండలో సీఎం పర్యటన.. ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

image

దేవరకొండలో ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను బుధవారం జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. హెలిపాడ్, సభాస్థలి, పార్కింగ్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సీఎం కాన్వాయ్ పర్యటించే రూట్ మ్యాప్‌ను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్ రావు, కమిషనర్ సుదర్శన్, ఏఈ రాజు, శంకర్ గౌడ్, సీఐ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

News December 3, 2025

రంగారెడ్డి: FREE కోచింగ్.. అప్లయి చేసుకోండి

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ చిలుకూరు డైరెక్టర్ ఎండీ. అలీఖాన్ Way2Newsతో తెలిపారు. సీసీ కెమెరా కోర్సులలో ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. 19-45 లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, బ్యాంకు పాస్ బుక్, ఆధార్, కాస్ట్ సర్టిఫికెట్, 4 ఫొటోలతో ఈనెల 5లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
– SHARE IT.