News December 1, 2025
జనగామలో అరుదైన కపాల శస్త్ర చికిత్స విజయవంతం

జనగామలో అరుదైన కపాల తల ఎముకల శస్త్ర చికిత్సను ఆయుష్మాన్ హాస్పిటల్ వైద్య బృందం విజయవంతంగా పూర్తిచేసింది. తిరుమలగిరి ప్రాంతానికి చెందిన 25 సంవత్సరాల ప్రవీణ్ అనే యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి చేరగా, కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే సాధ్యమయ్యే ఈ క్లిష్టమైన శస్త్ర చికిత్సను, జనగామలో ఆయుష్మాన్ హాస్పిటల్ వైద్యులైన డాక్టర్లు సతీష్, అభిలాష్, బిక్షపతి తదితర వారి బృందం ఈరోజు సమర్థవంతంగా నిర్వహించారు.
Similar News
News March 7, 2026
భద్రాద్రి: మనోడి సినిమాకు ‘గద్దర్’ అవార్డుల పంట

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ‘గద్దర్’ అవార్డుల్లో ఇల్లందు(M) కొమరానికి చెందిన సాయిలు కాంపాటి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఆయన తెరకెక్కించిన రాజు వెడ్స్ రాంబాయి చిత్రం ఉత్తమ సినిమాగానూ నిలిచింది. ఇదే చిత్రంలో నటించిన చైతు జొన్నలగడ్డ ఉత్తమ నటుడిగా, అనురాగ్ ఉత్తమ గాయకుడిగా అవార్డులు దక్కించుకున్నారు. 4 రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపికవ్వడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 7, 2026
భిక్కనూర్: పురుగుల అన్నంపై విచారణ

భిక్కనూర్ మండలం భగీరథపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పురుగుల అన్నంపై శనివారం విచారణ జరిపారు. విద్యార్థులకు పురుగులతో కూడిన మధ్యాహ్న భోజనం పెట్టడంతో విద్యార్థులు పారబోశారు. దీనిపై విచారణ జరిపించాలని ఎన్సీడీ వైద్యాధికారి శిరీషను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ఈ మేరకు ఆమె పాఠశాలకు వెళ్లి బియ్యాన్ని పరిశీలించారు. ఏజెన్సీ నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు అందజేశారు. అనంతరం వివరాలు సేకరించారు.
News March 7, 2026
అవార్డుతో ‘తెలంగాణ కోడలికి’ వెల్కమ్ అంటూ ఫ్యాన్స్ ఖుషీ

TG ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో హీరోయిన్ రష్మిక ‘ఉత్తమ నటి’ అవార్డు గెలుచుకోవడంపై ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రష్మికను ‘తెలంగాణ కోడలు’గా అభివర్ణిస్తూ.. ఈ పురస్కారం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ఘన స్వాగతం పలికిందని Xలో సందడి చేస్తున్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని అవార్డులు, సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. వారం క్రితమే విజయ్ దేవరకొండను రష్మిక మనువాడారు.


